హార్ట్‌బీట్‌ నుంచి నిద్ర వరకు… అన్నీ చెప్పే స్మార్ట్‌వాచ్‌! కేవలం రూ.599 కే... Environment: COP30లో చారిత్రాత్మక నిర్ణయం – ఉష్ణమండల అటవీ సంరక్షణకు కొత్త గ్లోబల్ ఫండ్‌కు 53 దేశాల మద్దతు!! Science Expo Tour: శాస్త్ర విజ్ఞానానికి కొత్త అనుభవం.. సైన్స్ ఎక్స్‌పోజర్ టూర్‌లో ఏపీ స్టూడెంట్స్! Health tips: రాత్రి మొబైల్ చేతిలో పట్టుకుని నిద్రపోతున్నారా? మీ ఆరోగ్యానికి ఇది పెద్ద ప్రమాదం! TTD Updates: తిరుమల తాజా అప్‌డేట్.. టోకెన్ల కేటాయింపులో కీలక మార్పులు! మూడు నెలల ముందుగానే..! Jio Offers: జియో మరో సర్ప్రైజింగ్ ఆఫర్! రూ.150లోపే అన్‌లిమిటెడ్ కాల్స్‌, డేటా! Ration Card: స్మార్ట్ రేషన్ కార్డులు.. అది చేయని వారికి షాక్..! లబ్ధిదారులపై కఠిన చర్యలు..! Vande Bharath: గోదావరి ప్రజలకు గుడ్ న్యూస్! వందే భారత్ రైలు సర్వీస్ నరసాపురం వరకు విస్తరణ! కృష్ణానదిపై హైలెవల్ బ్రిడ్జి.. రూ. 109 కోట్ల నిధులు మంజూరు! తీరనున్న ఆ ప్రాంతవాసుల ఏళ్ల నాటి కల.. Canada Plans: అమెరికాకు షాక్.. కెనడా మాస్టర్ ప్లాన్.. హెచ్-1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్.! హార్ట్‌బీట్‌ నుంచి నిద్ర వరకు… అన్నీ చెప్పే స్మార్ట్‌వాచ్‌! కేవలం రూ.599 కే... Environment: COP30లో చారిత్రాత్మక నిర్ణయం – ఉష్ణమండల అటవీ సంరక్షణకు కొత్త గ్లోబల్ ఫండ్‌కు 53 దేశాల మద్దతు!! Science Expo Tour: శాస్త్ర విజ్ఞానానికి కొత్త అనుభవం.. సైన్స్ ఎక్స్‌పోజర్ టూర్‌లో ఏపీ స్టూడెంట్స్! Health tips: రాత్రి మొబైల్ చేతిలో పట్టుకుని నిద్రపోతున్నారా? మీ ఆరోగ్యానికి ఇది పెద్ద ప్రమాదం! TTD Updates: తిరుమల తాజా అప్‌డేట్.. టోకెన్ల కేటాయింపులో కీలక మార్పులు! మూడు నెలల ముందుగానే..! Jio Offers: జియో మరో సర్ప్రైజింగ్ ఆఫర్! రూ.150లోపే అన్‌లిమిటెడ్ కాల్స్‌, డేటా! Ration Card: స్మార్ట్ రేషన్ కార్డులు.. అది చేయని వారికి షాక్..! లబ్ధిదారులపై కఠిన చర్యలు..! Vande Bharath: గోదావరి ప్రజలకు గుడ్ న్యూస్! వందే భారత్ రైలు సర్వీస్ నరసాపురం వరకు విస్తరణ! కృష్ణానదిపై హైలెవల్ బ్రిడ్జి.. రూ. 109 కోట్ల నిధులు మంజూరు! తీరనున్న ఆ ప్రాంతవాసుల ఏళ్ల నాటి కల.. Canada Plans: అమెరికాకు షాక్.. కెనడా మాస్టర్ ప్లాన్.. హెచ్-1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్.!

రాష్ట్రం మొత్తం జగన్ రెడ్డి జాగీర్! నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలు జాగీర్లు! సర్వం దోచేశారు!!

2024-02-10 18:13:00

ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కురుక్షేత్రానికి రంగం సిద్ధమవుతోంది.

నిన్నటి వరకు అధికార వైసీపీ  ప్రభుత్వంలో నేనే రాజు నేనే మంత్రి అన్నట్టుగా సాగిన పాలనకు అంతిమ ఘడియలు సమీపిస్తున్నాయి.

ఐదేళ్లుగా అధికార మదంతో ప్రజల హక్కులను కాలరస్తు బడుగు బలహీన వర్గాల పై దాడులు చేస్తూ ఎదిరిస్తే సొంత పార్టీ కార్యకర్తలను కాల రాసిన ఈయన ప్రభుత్వం నేడు మళ్లీ కార్యకర్తలను ఎన్నికలకు సమాయత్త్వం కావాలంటూ పిలిపిస్తున్నారు.

కార్యకర్తల రెక్కల కష్టం కార్యకర్తల సొమ్ముతో అధికారం దక్కించుకున్న ఈయన పార్టీ కార్యకర్తలను పూర్తిగా విస్మరించారు.

రాష్ట్రంలో వైసిపి కార్యకర్తలకు కనీస విలువలు లేకుండా ఈయన పాలన సాగింది.

వైసిపి ప్రభుత్వం లో గ్రామపంచాయతీ సభ్యులుగా సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా జడ్పిటిసిలుగా గెలుపొందిన వైసిపి కార్యకర్తలు నేడు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.

ఈయన స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసి పడేశారు.

పట్టణాలలోని మున్సిపాలిటీ కౌన్సిలర్లు చైర్మన్లు కూడా ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారు.

గ్రామాలలో పట్టణాలలో రోడ్లపై తట్టెడు మట్టి వేసే అధికారం కూడా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు లేదు.

రాష్ట్రం మొత్తం ఈయన జాగీర్ అయితే నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు జాగీర్లుగా దోచుకు తిన్నారు.

గ్రామాలలో ఎంతో కొంత అభివృద్ధి చేసి ప్రజల మెప్పు పొందుదాము అనుకునే వైసిపి నాయకులు కార్యకర్తలు ఆశలు అడియాసలయ్యాయి.

అప్పో చొప్పో చేసి గ్రామాలలో పనులు చేసిన వైసీపీ నాయకులకు బిల్లులు రాక అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు రాక ఎంతో మంది కాంట్రాక్టర్లు అల్లాడిపోయారు.

అధికార పార్టీ నాయకులకు కూడా ఈయన బిల్లులు చెల్లించకపోవడంతో నాయకులు కార్యకర్తలు డీలపడ్డారు.

ఎమ్మెల్యేలు కూడా కార్యకర్తల సంక్షేమం వదిలి వారి ఇష్టానుసారం దోపిడీ చేస్తున్నారు.

ఈ ప్రభుత్వంలో వైసిపి కార్యకర్తల ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యేలను పక్కన నియోజకవర్గాలకు మార్చడం తప్ప కార్యకర్తలకు మాత్రం ఒరిగింది లేదు.

సొంత పత్రిక, టీవీ, వ్యాపారాలను ఈయన అభివృద్ధి చేసుకుంటూ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తున్నట్లుగా మాట్లాడుతున్నారు.

జగన్ మూక సింహం సింగిల్ గా వస్తుంది అంటూ డైలాగులు చెబుతూ ఉంటే అవును క్రూరమృగం ఒంటరిగానే వస్తుంది సాదు జంతువుల పైకి అంటూ ప్రజలు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

రాష్ట్ర పరిస్థితిని అడవిలో క్రూర మృగంలా అస్తవ్యస్తంగా మార్చి మళ్లీ ఎన్నికలకు సిద్ధం అంటూ ఏ ముఖం పెట్టుకొని ప్రజల మధ్యకు వస్తున్నారు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చెల్లి ఐదేళ్లపాటు అణగద్రొక్కి ఎన్నికల ముందు దొంగ నోటిఫికేషన్ ఇస్తున్న ఈయన దొంగ చేష్టలను నిరుద్యోగులు గ్రహిస్తున్నారు.

గ్రామాలలో రోడ్ల నిర్మాణం లేదు డ్రైనేజీల అభివృద్ధి లేదు ఆర్ బి కే సచివాలయం అంటూ ఉన్న పంచాయతీ భవనాలను కూల్చి కొత్తవి కట్టి ఇదే అభివృద్ధి అని జగన్ చేస్తున్న ప్రచారం చూసి ప్రజలు చీ కొడుతున్నారు.

ఎన్నికల ముందు యువకులను ఆకట్టుకునేందుకు ఆడుదాం ఆంధ్ర అంటూ ఈయన దొంగాటకు తెర తీశారు.

నిధులు విధులు లేని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఈయన ప్రభుత్వం పై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు.

గ్రామాలలో సహజ సంపద నుండి రాష్ట్రానికి వచ్చే అన్ని ఆదాయ వనరులు తాడేపల్లి ప్యాలెస్ కు లేదా ఎమ్మెల్యే ఇంటికి దారి పడుతున్నాయి తప్ప ప్రజలకు కార్యకర్తలకు ఒరిగింది లేదు.

అధికారం చేపట్టిన నాటినుండి భారీ కేడ్లు పరదాల మాటున ఉన్న ఈయన మళ్ళీ అధికార కోసం ప్రజల మధ్యకు వెళ్లి మాట్లాడడానికి రాంప్ వాక్ డయాసులు వేస్తున్నారు.

దీనికి కూడా ప్రజలకు అందనంత దూరంలో భారీకేడ్లు ఏర్పాటు చేసి వాటి పక్కన వందల కొలది పోలీసుల పహారా మధ్యనే ఈయన  సంచరిస్తారు.

తప్పు చేసిన వాడు ప్రజల మధ్యకు రావడానికి భయపడతాడు తప్పు చేయని వాడు ప్రజలతో మమేకమవుతారు.

రాష్ట్రంలో ఐదేళ్లుగా జరుగుతున్న పరిస్థితులను చూస్తే ఈయన చేసేవన్నీ తప్పులే కాబట్టి ప్రజలకు దూరంగా బతుకుతున్నారు.

తప్పుడు నిర్ణయాలతో పనిచేస్తున్న ఈయన ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలపై పది నిమిషాలు కూడా మాట్లాడే ధైర్యం లేదు.

రాష్ట్రంలో ప్రజలు ఎవరైనా వారి సమస్యలు తెలపడానికి ఈయన నివాసం ఉంటున్న తాడేపల్లి పాలస్ వద్దకు వెళితే వారిపై నిర్ధాక్షణంగా దాడులు చేయించి జైల్లో వేస్తున్నారు.

రాష్ట్రంలో ప్రజల సంగతి దేవుడెరుగు కనీసం వైసిపి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు కూడా ఈయన కటాక్షం దొరకక మీడియా ముందు ఏడుస్తున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి.

సింహం అంటున్న క్రూర మృగంలాంటి మనస్తత్వం కలిగిన ఈయన పాలనను వచ్చే ఎన్నికలలో అంతమొందించకపోతే ఆవులమందలాంటి ప్రజానీకానికి రక్షణ కరువుతోందన్న అభిప్రాయానికి ప్రజలు వచ్చారు.

ఈయన ప్రభుత్వంలో పని చేసిన ఎంతోమంది నాయకులు కూడా ఈయన లాంటి వ్యక్తి ప్రజాస్వామ్య దేశంలో పాలకుడిగా అనర్హుడంటున్నారు.

ఈయన యుద్ధానికి సిద్ధమా అని పిలుపునిస్తూ ఉంటే కార్యకర్తలు జగన్ ఓటమికి సిద్ధం అంటూ సమాధానం ఇస్తున్నారు.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →