Movie update: పెద్ది నుంచి ‘చికిరి’ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్ — రామ్ చరణ్ హుక్ స్టెప్‌కి సోషల్‌ మీడియాలో హైప్!! Andhra Pradesh: రాయలసీమలో రూ.22,000 కోట్ల పెట్టుబడులు — SAEL ఇండస్ట్రీస్ ప్రాజెక్టులతో భారీగా ఉద్యోగావకాశాలు!! New Year 2026: న్యూ ఇయర్ 2026 ట్రావెల్ ట్రెండ్.. బీచ్‌లు లాంతర్లు, లగ్జరీ పార్టీలు.. మీ గమ్యం ఏది! healthy skin remedies: బ్యూటీ క్రీమ్స్ ఎందుకు? చర్మానికి సొరకాయ ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యానికి గురవుతారు!! Liquor: ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు..! బెయిల్‌ పిటిషన్‌పై కోర్టు సీరియస్‌..! 140 మీటర్ల వెడల్పు, 6 వరుసల రోడ్డు.. అమరావతి ORRపై కీలక అప్‌డేట్! 40 గ్రామాల్లో భూసేకరణ... Movie update: జూనియర్ ఎన్టీఆర్ కొత్త లుక్ ! “డ్రాగన్” కోసం మాస్ ట్రాన్స్‌ఫర్మేషన్ – సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు!! Health: భోజనం సమయంలో నీళ్లు తాగుతున్నారా? ఆ అలవాటు వల్లే ఈ సమస్యలు! Fraud Case: బ్యాంకు రుణాల ఎగవేత కేసులో మళ్లీ చిక్కుల్లో అనిల్ అంబానీ..! ఈడీ నోటీసులు జారీ..! ప్రభుత్వ నిర్ణయంపై ఎమ్మెల్యే లేఖ... రాప్తాడులోని 6 మండలాలకు 2 రెవెన్యూ డివిజన్లే మేలు! Movie update: పెద్ది నుంచి ‘చికిరి’ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్ — రామ్ చరణ్ హుక్ స్టెప్‌కి సోషల్‌ మీడియాలో హైప్!! Andhra Pradesh: రాయలసీమలో రూ.22,000 కోట్ల పెట్టుబడులు — SAEL ఇండస్ట్రీస్ ప్రాజెక్టులతో భారీగా ఉద్యోగావకాశాలు!! New Year 2026: న్యూ ఇయర్ 2026 ట్రావెల్ ట్రెండ్.. బీచ్‌లు లాంతర్లు, లగ్జరీ పార్టీలు.. మీ గమ్యం ఏది! healthy skin remedies: బ్యూటీ క్రీమ్స్ ఎందుకు? చర్మానికి సొరకాయ ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యానికి గురవుతారు!! Liquor: ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు..! బెయిల్‌ పిటిషన్‌పై కోర్టు సీరియస్‌..! 140 మీటర్ల వెడల్పు, 6 వరుసల రోడ్డు.. అమరావతి ORRపై కీలక అప్‌డేట్! 40 గ్రామాల్లో భూసేకరణ... Movie update: జూనియర్ ఎన్టీఆర్ కొత్త లుక్ ! “డ్రాగన్” కోసం మాస్ ట్రాన్స్‌ఫర్మేషన్ – సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు!! Health: భోజనం సమయంలో నీళ్లు తాగుతున్నారా? ఆ అలవాటు వల్లే ఈ సమస్యలు! Fraud Case: బ్యాంకు రుణాల ఎగవేత కేసులో మళ్లీ చిక్కుల్లో అనిల్ అంబానీ..! ఈడీ నోటీసులు జారీ..! ప్రభుత్వ నిర్ణయంపై ఎమ్మెల్యే లేఖ... రాప్తాడులోని 6 మండలాలకు 2 రెవెన్యూ డివిజన్లే మేలు!

చంద్రబాబు ఆలోచనలు ఎప్పుడూ ప్రజల బాగోగుల గురించే... 50 రోజుల్లో కురుక్షేత్ర మహా సంగ్రామం: నారా భువనేశ్వరి

2024-02-09 17:57:00

'నిజం గెలవాలి' యాత్రలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలోని చందర్లపాడు మండలం కోనాయపాలెంలో చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి పర్యటించారు. చంద్రబాబు అరెస్టుతో మనస్తాపానికి గురై గుండెపోటుతో మృతి చెందిన వనపర్తి మల్లికార్జున కుటుంబసభ్యులను పరామర్శించారు. మల్లికార్జున చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. టీడీపీ అండగా ఉంటుంది అని కుటుంబ సభ్యులకు భరోసా ఇస్తూ రూ.3 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

చంద్రబాబు అక్రమ అరెస్టుతో మనస్తాపానికి గురై మృతి చెందిన వారిలో ఇప్పటివరకు 60 కుటుంబాలను పరామర్శించానని భువనేశ్వరి తెలిపారు. ఇంకా 160 కుటుంబాలను పరామర్శించాల్సి ఉందని చెప్పారు. చంద్రబాబు ఆలోచనలు ఎప్పుడూ ప్రజల బాగోగుల గురించేనని... చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు తెలుగుదేశం కుటుంబ సభ్యులందరినీ పరామర్శించి ధైర్యం చెప్పాలని తనతో అన్నారని గుర్తుచేశారు. అందుకే 'నిజం గెలవాలి' చేపట్టానన్నారు. రానున్న 50 రోజుల్లో కురుక్షేత్ర మహా సంగ్రామం జరుగుతుందని.. తప్పకుండా మనమే గెలుస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

అనంతరం జగ్గయ్యపేట నియోజకవర్గంలో భువనేశ్వరి పర్యటించారు. పెనుగంచిప్రోలు మండలం, పెనుగంచిప్రోలు గ్రామంలో పార్టీ కార్యకర్త అలవాల గోపయ్య కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. గోపయ్య(63), 22-10-2023న గుండెపోటుతో మృతిచెందారు. గోపయ్య భార్య పుల్లమ్మ, కుమార్తె రమాదేవిలను భువనేశ్వరి ఓదార్చి, వారి యోగక్షేమాలడిగి తెలుసుకున్నారు. గోపయ్య కుటుంబ సభ్యులకు రూ.3లక్షల చెక్కు ఇచ్చి ఆర్థికసాయం అందించారు.

అనంతరం జగ్గయ్యపేట రూరల్ మండలం, గౌరవరం గ్రామంలో పార్టీ కార్యకర్త కుక్కుల ప్రభాకరరావు కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. ప్రభాకరరావు(60), 10-09-2023న గుండెపోటుతో మృతిచెందారు. ప్రభాకరరావు భార్య పుష్పమ్మ, కుమారులు సురేష్, జగదీష్, ప్రదీప్ లను భువనేశ్వరి ఓదార్చారు. వారికి రూ.3లక్షల చెక్కు ఇచ్చి ఆర్థికసాయం అందించారు.

తరువాత జగ్గయ్యపేట రూరల్ మండలం, బలుసుపాడు గ్రామంలో పార్టీ కార్యకర్త గండమాల వెంకటేశ్వర్లు కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. వెంకటేశ్వర్లు భార్య తేరోజమ్మ, కుమార్తెలు రమాదేవి, బేబిరాణి, లావణ్య, కుమారులు సురేష్, నాగరాజు, ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చి, ధైర్యం చెప్పారు. వారి యోగక్షేమాలడిగి తెలుసుకుని వారికి రూ.3లక్షల చెక్కు అందించారు. పర్యటన ముగిసిన అనంతరం భువనేశ్వరి హైదరాబాద్ తిరుగుపయనమయ్యారు.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →