Dagadarthi visit: మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబాన్ని పరామర్శించేందుకు దగదర్తి వెళ్లిన లోకేష్‌కి దారి పొడవునా ప్రజల ఘనస్వాగతం!! SBI: రోజుకు కాఫీ ఖర్చుతో రూ.40 లక్షల బీమా..! ఎస్‌బీఐ అద్భుత అవకాశం..! NTR: హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ఎన్టీఆర్ మాస్ లుక్‌కి ఫ్యాన్స్ ఫిదా.. ఇది డ్రాగన్ లుక్ అయి ఉండొచ్చు.. సోషల్ మీడియాలో! AP Government: ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం! రాష్ట్రంలో 2 కొత్త జిల్లాలు... 6 రెవెన్యూ డివిజన్లు! Youth Europe: రైళ్ల ద్వారా ఐక్యత.. యూరోప్ యువతకు యూనియన్ ప్రత్యేక బహుమతి! Cyber Crime: ట్రేడింగ్ యాప్ పేరిట తిరుపతిలో రూ.150 కోట్లు హాంఫట్! భయానక దృశ్యం! విశాఖపట్నం నుంచి బయలుదేరిన ఆర్టీసీ బస్సులో భారీ అగ్ని ప్రమాదం! Electricity: విద్యుత్ వినియోగదారులకు శుభవార్త..! ఇక అధిక కరెంట్‌ బిల్లులకు గుడ్‌బై..! Nara Lokesh: ప్రభుత్వ విద్యాలయాల్లో పరిపాలనపై మంత్రి కీలక ఆదేశాలు! Mega PTM: విద్యార్థులు, తల్లిదండ్రులకు శుభవార్త..! ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మెగా పీటీఎం..! Dagadarthi visit: మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబాన్ని పరామర్శించేందుకు దగదర్తి వెళ్లిన లోకేష్‌కి దారి పొడవునా ప్రజల ఘనస్వాగతం!! SBI: రోజుకు కాఫీ ఖర్చుతో రూ.40 లక్షల బీమా..! ఎస్‌బీఐ అద్భుత అవకాశం..! NTR: హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ఎన్టీఆర్ మాస్ లుక్‌కి ఫ్యాన్స్ ఫిదా.. ఇది డ్రాగన్ లుక్ అయి ఉండొచ్చు.. సోషల్ మీడియాలో! AP Government: ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం! రాష్ట్రంలో 2 కొత్త జిల్లాలు... 6 రెవెన్యూ డివిజన్లు! Youth Europe: రైళ్ల ద్వారా ఐక్యత.. యూరోప్ యువతకు యూనియన్ ప్రత్యేక బహుమతి! Cyber Crime: ట్రేడింగ్ యాప్ పేరిట తిరుపతిలో రూ.150 కోట్లు హాంఫట్! భయానక దృశ్యం! విశాఖపట్నం నుంచి బయలుదేరిన ఆర్టీసీ బస్సులో భారీ అగ్ని ప్రమాదం! Electricity: విద్యుత్ వినియోగదారులకు శుభవార్త..! ఇక అధిక కరెంట్‌ బిల్లులకు గుడ్‌బై..! Nara Lokesh: ప్రభుత్వ విద్యాలయాల్లో పరిపాలనపై మంత్రి కీలక ఆదేశాలు! Mega PTM: విద్యార్థులు, తల్లిదండ్రులకు శుభవార్త..! ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మెగా పీటీఎం..!

చంద్రబాబు ఆలోచనలు ఎప్పుడూ ప్రజల బాగోగుల గురించే... 50 రోజుల్లో కురుక్షేత్ర మహా సంగ్రామం: నారా భువనేశ్వరి

2024-02-09 17:57:00

'నిజం గెలవాలి' యాత్రలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలోని చందర్లపాడు మండలం కోనాయపాలెంలో చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి పర్యటించారు. చంద్రబాబు అరెస్టుతో మనస్తాపానికి గురై గుండెపోటుతో మృతి చెందిన వనపర్తి మల్లికార్జున కుటుంబసభ్యులను పరామర్శించారు. మల్లికార్జున చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. టీడీపీ అండగా ఉంటుంది అని కుటుంబ సభ్యులకు భరోసా ఇస్తూ రూ.3 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

చంద్రబాబు అక్రమ అరెస్టుతో మనస్తాపానికి గురై మృతి చెందిన వారిలో ఇప్పటివరకు 60 కుటుంబాలను పరామర్శించానని భువనేశ్వరి తెలిపారు. ఇంకా 160 కుటుంబాలను పరామర్శించాల్సి ఉందని చెప్పారు. చంద్రబాబు ఆలోచనలు ఎప్పుడూ ప్రజల బాగోగుల గురించేనని... చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు తెలుగుదేశం కుటుంబ సభ్యులందరినీ పరామర్శించి ధైర్యం చెప్పాలని తనతో అన్నారని గుర్తుచేశారు. అందుకే 'నిజం గెలవాలి' చేపట్టానన్నారు. రానున్న 50 రోజుల్లో కురుక్షేత్ర మహా సంగ్రామం జరుగుతుందని.. తప్పకుండా మనమే గెలుస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

అనంతరం జగ్గయ్యపేట నియోజకవర్గంలో భువనేశ్వరి పర్యటించారు. పెనుగంచిప్రోలు మండలం, పెనుగంచిప్రోలు గ్రామంలో పార్టీ కార్యకర్త అలవాల గోపయ్య కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. గోపయ్య(63), 22-10-2023న గుండెపోటుతో మృతిచెందారు. గోపయ్య భార్య పుల్లమ్మ, కుమార్తె రమాదేవిలను భువనేశ్వరి ఓదార్చి, వారి యోగక్షేమాలడిగి తెలుసుకున్నారు. గోపయ్య కుటుంబ సభ్యులకు రూ.3లక్షల చెక్కు ఇచ్చి ఆర్థికసాయం అందించారు.

అనంతరం జగ్గయ్యపేట రూరల్ మండలం, గౌరవరం గ్రామంలో పార్టీ కార్యకర్త కుక్కుల ప్రభాకరరావు కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. ప్రభాకరరావు(60), 10-09-2023న గుండెపోటుతో మృతిచెందారు. ప్రభాకరరావు భార్య పుష్పమ్మ, కుమారులు సురేష్, జగదీష్, ప్రదీప్ లను భువనేశ్వరి ఓదార్చారు. వారికి రూ.3లక్షల చెక్కు ఇచ్చి ఆర్థికసాయం అందించారు.

తరువాత జగ్గయ్యపేట రూరల్ మండలం, బలుసుపాడు గ్రామంలో పార్టీ కార్యకర్త గండమాల వెంకటేశ్వర్లు కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. వెంకటేశ్వర్లు భార్య తేరోజమ్మ, కుమార్తెలు రమాదేవి, బేబిరాణి, లావణ్య, కుమారులు సురేష్, నాగరాజు, ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చి, ధైర్యం చెప్పారు. వారి యోగక్షేమాలడిగి తెలుసుకుని వారికి రూ.3లక్షల చెక్కు అందించారు. పర్యటన ముగిసిన అనంతరం భువనేశ్వరి హైదరాబాద్ తిరుగుపయనమయ్యారు.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →