మోటోరోలా బంపర్ ఆఫర్.. రూ. 3000 తగ్గింపుతో.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ ఫోన్ మీ సొంతం! 256GB స్టోరేజీ, వైర్‌లైస్ ఛార్జింగ్‌ సహా! Hoxo robot: న్యూక్లియర్ రంగంలో ఏఐ విప్లవం.. హోక్సో రోబోట్ రంగప్రవేశం! ది గర్ల్ ఫ్రెండ్ మూవీ రివ్యూ! రష్మిక జీవితంలోనే అత్యంత ఇంటెన్స్ పాత్ర... అదరగొట్టేశారుగా! Pakistan fan: జనగణమనకు పాక్ అభిమాని సెల్యూట్.. క్రీడాస్ఫూర్తి సరిహద్దులు దాటింది! Highway: విజయవాడ–హైదరాబాద్ నేషనల్ హైవే అప్‌గ్రేడ్..! ఆరు వరుసలతో ప్రయాణం వేగవంతం..! Auto Sales: ఆటో అమ్మకాలు రికార్డు స్థాయికి.. పండుగ సీజన్‌, జీఎస్టీ తగ్గింపులు ప్రభావం అంటున్నా ఆటో నిపుణులు!! BHEL Exam: సాంకేతిక లోపాలతో బీహెచ్‌ఈఎల్‌ ఆర్టిసన్‌ పరీక్ష రద్దు..! త్వరలో కొత్త తేదీలు..! kidney Stones: టమాటాలు తింటే కిడ్నీ రాళ్లు వస్తాయా... తెలిస్తే షాక్ అవుతారు! Google Maps: గూగుల్ మ్యాప్స్ అదిరిపోయే సరికొత్త ఫీచర్! మీరు అసలు ఊహించలేరు... ఒక లుక్కేయండి! Airport: ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో మరోసారి సాంకేతిక సమస్య..! గంటల తరబడి నిలిచిన విమానాలు..! మోటోరోలా బంపర్ ఆఫర్.. రూ. 3000 తగ్గింపుతో.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ ఫోన్ మీ సొంతం! 256GB స్టోరేజీ, వైర్‌లైస్ ఛార్జింగ్‌ సహా! Hoxo robot: న్యూక్లియర్ రంగంలో ఏఐ విప్లవం.. హోక్సో రోబోట్ రంగప్రవేశం! ది గర్ల్ ఫ్రెండ్ మూవీ రివ్యూ! రష్మిక జీవితంలోనే అత్యంత ఇంటెన్స్ పాత్ర... అదరగొట్టేశారుగా! Pakistan fan: జనగణమనకు పాక్ అభిమాని సెల్యూట్.. క్రీడాస్ఫూర్తి సరిహద్దులు దాటింది! Highway: విజయవాడ–హైదరాబాద్ నేషనల్ హైవే అప్‌గ్రేడ్..! ఆరు వరుసలతో ప్రయాణం వేగవంతం..! Auto Sales: ఆటో అమ్మకాలు రికార్డు స్థాయికి.. పండుగ సీజన్‌, జీఎస్టీ తగ్గింపులు ప్రభావం అంటున్నా ఆటో నిపుణులు!! BHEL Exam: సాంకేతిక లోపాలతో బీహెచ్‌ఈఎల్‌ ఆర్టిసన్‌ పరీక్ష రద్దు..! త్వరలో కొత్త తేదీలు..! kidney Stones: టమాటాలు తింటే కిడ్నీ రాళ్లు వస్తాయా... తెలిస్తే షాక్ అవుతారు! Google Maps: గూగుల్ మ్యాప్స్ అదిరిపోయే సరికొత్త ఫీచర్! మీరు అసలు ఊహించలేరు... ఒక లుక్కేయండి! Airport: ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో మరోసారి సాంకేతిక సమస్య..! గంటల తరబడి నిలిచిన విమానాలు..!

చంద్రబాబు బీజేపీతో పొత్తును వ్యతిరేకించే ప్రతి ఒక్కరు... కార్యకర్త కష్టం ఆలోచించారా?? : ఎం ఎ షరీఫ్

2024-02-09 14:51:00

తెలుగుదేశం పార్టీలోని అత్యధిక  శ్రేణులు బిజెపితో పొత్తును వ్యతిరేకిస్తున్నాయి కానీ... కమ్యూనిస్టుల్లా సిద్దాంతాలకే ప్రాధాన్యతనిచ్చి ముందుకెళితే మిగిలేది సిద్దాంతాలే... పార్టీ కాదు.  సమాజంలో పరిస్థితులను అనుకూలంగా మలుచుకుంటూ సిద్ధాంతాలతో ముందుకు వెళితే పార్టీతో పాటు పార్టీని నమ్ముకున్న కార్యకర్తల కుటుంబాలు క్షేమంగా ఉంటాయి.

 

నాకు తెలిసి పెద్దాయన చంద్రబాబు కూడా ఇదే లాజిక్ తో ముందుకెళ్తున్నాడు కేంద్రంలో ఏం జరుగుతుంది, రాష్ట్రంలో ఏం జరగబోతుంది అనేది పెద్దాయనకి తెలిసినంతగా మనకు తెలియకపోవచ్చు  2024 ఎన్నికల్లో చిన్న పొరపాటు జరిగి తేడా పడ్డామో పార్టీని నమ్ముకొని అధికార పార్టీపై ఇప్పటివరకు పోరాటం చేసిన కొన్ని లక్షల మంది తెలుగుదేశం పార్టీ కుటుంబాలు ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టి పారిపోవాల్సిందే, ఇక్కడ బతకనివ్వరు. 

 

రాష్ట్రంలో తీవ్రమైన నేరాలకు పాల్పడిన వైఎస్సార్సీపీ బడా నాయకులు, వారికి సహకరించిన కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల ప్రవర్తనలో ఇప్పటికీ మార్పు లేదు. ఈ నాలుగున్నర సంవత్సరాల్లో వాళ్లు చేసిన తీవ్రమైన తప్పిదాల నుండి వాళ్లని వాళ్ళు కాపాడుకోవాలంటే 2024 ఎన్నికలలో వాళ్లు అధికార దుర్వినియోగనికి పాల్పడేదుకు వెనుకాడరని సత్యాన్ని గమనించాలి.  వీటన్నిటి దృష్ట్యా జగన్ రెడ్డికి, జగన్ రెడ్డి తొత్తులకి జగన్ రెడ్డికి బానిసలుగా పనిచేస్తున్న కొంతమంది అధికారుల ఒంటెద్దు పోకడలకు, చెక్ పెట్టడానికే బాబుగారు బిజెపితో పొత్తు కెళ్తున్నట్లు సమాచారం.

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఏది ఏమైనా చంద్రబాబు గారు ఒక నిర్ణయం తీసుకున్నారంటే దాని వెనుక ఎంతో కసరత్తు జరుగుతుంది. ఆయన ఏది చేసినా ఈ రాష్ట్రం కోసం తెలుగుదేశం పార్టీ కోసం, ముస్లిం సోదరుల మతసామరస్యంతో కూడుకున్న సంక్షేమం కోసం, పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం, తీసుకున్న నిర్ణయమే బిజెపితో పొత్తుగా భావించాలి.  రాష్ట్ర హితాన్ని, తెలుగు జాతి బంగారు భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని పెద్దాయన తీసుకున్న నిర్ణయాన్ని దయచేసి ఎవ్వరూ వ్యతిరేకించరని, ఆయన నిర్ణయాన్ని సమర్ధించి మనస్ఫూర్తిగా సహకరిస్తారని ఆశిస్తున్నాను అని శాసనమండలి మాజీ అధ్యక్షులు ఎం ఎ షరీఫ్ ఒక ప్రకటన ద్వారా తెలిపారు. 

 

 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →