వచ్చే ఎన్నికల్లో టీడీపీ 17 లోక్ సభ స్థానాలను గెలుచుకోబోతోందంటూ ఇండియా టుడే- సి ఓటర్ సర్వే వెల్లడించడంపై ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 'ఎక్స్'లో స్పందించారు. ‘వైసీపీకి అంతిమయాత్ర పక్కా! సైకో పోతున్నాడు, సైకిల్ వస్తోందని ఇండియా టుడే- సి ఓటర్ సర్వే చెప్పింది' అని ఆయన వ్యాఖ్యానించారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఆ సర్వే వివరాలతో ఆజాక్ ఛానల్ ప్రసారం చేసిన చిత్రాన్ని జత చేసి ట్వీట్ చేసారు. 'ఏపీలో 45 శాతం ఓటర్లు టీడీపీ-జనసేనతో ఉన్నారు. ఈ రెండు పార్టీలు 17 లోక్సభ సీట్లు గెలుచుకుంటాయి. 41 శాతం ఓట్లతో వైకాపా 8 స్థానాలకు పరిమితం కానుంది' అని ఆ ఛానల్ సర్వేలో పేర్కొన్న విషయాలను లోకేష్ ప్రస్తావించారు.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి