మెల్బోర్న్: ఆస్ట్రేలియా లో బీచ్ కు వెళ్లిన నలుగురు భారతీయులు నిటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. విక్టోరియా రాష్ట్రంలోని ఫిలిప్ ఐలాండ్ కు చెందిన బీచ్ వద్ద బుధవారం జనవరి 24, 2024 మధ్యాహ్నం సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నీటిలో మునిగిపోతున్న నలుగురిని గుర్తించిన స్థానికులు కాపాడేందుకు ప్రయత్నించగా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే ముగ్గరు మరణించారు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న మరొకరిని ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు హహిళలు. ఈ సంఘటనపై కాన్ బెర్రాలోని భారత హై కమిషన్ స్పందించింది. ఇలాంటి విషాదం జరిగినందుకు బాధ వ్యక్తం చేసింది. ఈ మేరకు మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేసింది.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి