ఏపీలో డిప్లొమో పూర్తి చేసినవారికి చంద్రబాబు సర్కార్ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది.. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలెప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్వంలో ఇండస్ట్రీ ట్రైనింగ్ ప్రొగ్రామ్ ద్వారా తిరుపతిలోని శ్రీ సిటీలో ఉన్న ఆల్‌స్టోమ్ సహకారంతో ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నారు. ఈ విషయాన్ని ఏపీ స్కిల్ డెవలెప్మెంట్ కార్పొరేషన్ తెలిపింది. డిప్లొమో పూర్తి చేసిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డిప్లొమో (మెకానికల్, ఈసీఈ, ఈఈఈ, ఆటోమొబైల్), ఐటీఐ (వెల్డర్స్)కు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. 2021, 2022, 2023, 2024లో డిప్లొమో పూర్తి చేసిన విద్యార్థులు (అబ్బాయిలు, అమ్మాయిలు) అర్హులుగా నిర్ణయించారు.. వీరి వయసు కచ్చితంగా 18 ఏళ్ల నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి. వీరికి ఏడాదికి 2.55 లక్షలతో పాటుగా మరో రూ.20వేలు సైట్ అలవెన్స్ అందిస్తారు.. అంటే మొత్తం కలిపి దాదాపు రూ.3లక్షల ప్యాకేజ్ ఇస్తారు. మొత్తం 60 ఖాళీలు ఉన్నాయని.. 45 రోజుల పాటూ ట్రైనింగ్ ఉంటుందని తెలిపారు.
ఇంకా చదవండి: పార్లమెంటు లో ఇంట్రెస్టింగ్ సీన్... ప్రతిపక్షం అంటే ఇలా ఉండాలి! చూసి నేర్చుకో జగన్ రెడ్డి!
తిరుపతిలోని శ్రీసిటీలో పని చేయాల్సి ఉంటుందన్నారు. జీతంతో పాటుగా ఉచితంగా భోజనం, ట్రాన్స్‌పోర్ట్, రెండు వారాల పాటూ ఉచితంగా వసతి కల్పిస్తారు. అంతేకాదు ఉద్యోగంలో చేరినవారికి రూ.6లక్షల మెడికల్ ఇన్స్యూరెన్స్ కవరేజ్ కూడా సదరు కంపెనీ అందిస్తోంది. అర్హత ఉండి ఆసక్తి కలిగినవారు వారి రెజ్యూమ్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, విద్యార్హతకు సంబంధించిన సర్టిఫికేట్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీలు అందజేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు చివరి తేదీ ఈ నెల 28 (జూన్ 28).. మరిన్ని వివరాలకు 9908243736 నంబర్‌కు సంప్రదించాలని సూచించారు.
ఇవి కూడా చదవండి:
అఫ్గానిస్థాన్‌లో ఇంటర్నెట్ ఛార్జీలు చూస్తే షాక్ అవ్వాల్సిందే! 3జీతో తిప్పలు!
మాచర్లకు పట్టిన పీడ వదిలింది! గుండా సన్నాసి పిన్నెల్లి అరెస్ట్! కఠినంగా శిక్షించాలి
కేసు పెట్టిందే కాక వైసీపీ చెంచాలతో బెదిరింపు కాల్స్! వైరల్ ట్వీట్!
చరిత్రలో తొలిసారి లోక్ సభ స్పీకర్ పదవికి ఎన్నిక! ఓటింగ్ కు 7 గురు ఎంపీలు దూరం!
ఆసక్తికరంగా లోక్ సభ స్పీకర్ ఎన్నిక! ఎన్డీయేకి వైసీపీ మద్దతు?
రైతు భరోసా పథకం పేరు మార్చిన ఏపీ సర్కార్! కొత్త పేరు అదే!
క్రీడల్లో రాజీకీయ జోక్యం ఉండకూడదు! క్రికెటర్ హనుమ విహారికి అండగా ఉంటానన్న లోకేష్!
ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‍కు దక్కని ఊరట! కొనసాగానున్న స్టే!
జగన్ బ్రో సైకోఇజం ముందు కిమ్ కూడా పనికిరాడు! గంటా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: