అన్ని రంగాల్లోకీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) చొరబడుతుండడంతో ఉద్యోగాలు గల్లంతు కావడం ఖాయమని ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ అమెరికాలోని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) అధ్యయనం ఊపిరి పీల్చుకునే వార్త చెప్పింది. ఉద్యోగాలను ఇప్పటికిప్పుడు కృత్రిమ మేధతో భర్తీ చేయడం దాదాపు అసాధ్యమని పేర్కొంది. అది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని పేర్కొంది.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
కంపెనీలకు ఏఐ(AI)ని నియమించుకోవటం కంటే ఆ స్థానంలో ఉద్యోగులను కొనసాగించటమే తక్కువ ఖర్చుతో కూడుకొన్న వ్యవహారమని ఎమ్ఐటీ(MIT) నివేదికలో వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా ఏఐ వల్ల ఉద్యోగాలకు ముప్పు ఉందని ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో ఉద్యోగస్తులకు ఎంతో ఊరటనిస్తుంది ఈ విషయం. కేవలం 23 శాతం ఉద్యోగాలను మాత్రమే ఏఐతో రీప్లేస్ చేయడం కంపెనీలకు ఖర్చులపరంగా కలిసొస్తుందని తమ పరిశీలనలో గుర్తించినట్లు ఎంఐటీ నివేదిక తెలిపింది.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి