సౌదీ అరేబియా గవర్నమెంట్ కొత్త రూల్ ని పాస్ చేసింది.
ఎగ్జిట్ మరియు రీ-ఎంట్రీ వీసాల గడువు ముగిసేలోపు దేశానికి తిరిగి రాలేని ప్రవాసులపై మూడేళ్ల నిషేధాన్ని ఎత్తివేసినట్లు స్థానిక సౌదీ వార్తాపత్రిక ఓకాజ్ నివేదించింది.
ఎగ్జిట్ మరియు రీ-ఎంట్రీ వీసా గడువు ముగిసేలోపు తిరిగి రాలేని ప్రవాసులను అనుమతించాలని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్‌పోర్ట్స్ (జవాజాత్) అన్ని డిపార్ట్మెంట్స్ కి ఆదేశాలను తెలియజేశారు.
ఇకపై ఎగ్జిట్ మరియు రీ-ఎంట్రీ గడువులోపు రాకపోయినా కూడా సౌదీలోకి ప్రవేశించవచ్చని ఇది జనవరి 16 నుండి అమలులో ఉందని తెలిపారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
అయితే ఎవరైతే ఎగ్జిట్ మరియు రీ-ఎంట్రీ వీసా పెట్టుకుంటారో వారి యొక్క ఫింగర్ప్రింట్ మరియు చెల్లుబాటు అయ్యే వీసా ఉండాలి.
ఇక ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించవచ్చని అంతేకాకుండా కొత్తగా ఉద్యోగ అవకాశాలు, హయ్యర్ స్టడీస్, ఇతర పనులు చేసుకోవడానికి అవకాశం ఇస్తుందిని తెలియజేశారు.
ప్రవాసులు యొక్క పాస్పోర్ట్ చెల్లుబాటు కనీసం 90 రోజుల వరకు ఉండాలి.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి