టీజీ టెట్-2024 ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్, టెట్ మరియు డీఎస్సీ అభ్యర్థులకు శుభవార్తను తెలియజేశారు. టెట్ దరఖాస్తుల సమయంలో ఎన్నికల కోడ్ కారణంగా టెట్ దరఖాస్తు ఫీజు తగ్గింపు నిర్ణయాన్ని ఎన్నికల కమిషన్ అంగీకరించలేదని, దరఖాస్తుదారులకు ఉపశమనం కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని ఆయన వెల్లడించారు. టెట్-2024లో అర్హత సాధించని దరఖాస్తుదారులకు వచ్చే టెట్‌కు ఉచితంగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తామని, అలాగే టెట్-2024లో అర్హత సాధించిన వారికి ఒకసారి ఉచితంగా డీఎస్సీ దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నట్లు తెలిపారు.
ఇంకా చదవండి: ఉదయం 4 గంటలకు! AP మంత్రుల ఫైనల్ జాబితా విడుదల! ఇదే ఆ లిస్ట్!
టెట్-2024 పరీక్షకు 2,86,381 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, పేపర్-1 పరీక్షకు 85,996 మంది హాజరయ్యారు. ఇందులో 57,725 మంది అర్హత సాధించగా, పేపర్-2 పరీక్షకు 1,50,491 మంది హాజరయ్యారు. ఇందులో 51,443 మంది అర్హత సాధించారు. పేపర్-1లో అర్హత సాధించిన వారి శాతం 67.13% కాగా, పేపర్-2లో 34.18% అర్హత సాధించారు. ఈ ఫలితాలను https://schooledu.telangana.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.
ఇంకా చదవండి: నారా చంద్ర బాబు అనే నేను! ఆ మాటకి దద్దరిల్లిన ప్రజా వేదిక!
2023తో పోలిస్తే పేపర్-1లో 30.24% అర్హత శాతం పెరిగింది, పేపర్-2లో 18.88% అర్హత శాతం పెరిగిందని సీఎం రేవంత్ తెలిపారు. టెట్ దరఖాస్తుల సమయంలో ఫీజు తగ్గింపు నిర్ణయాన్ని ఎన్నికల కమిషన్ అంగీకరించకపోవడంతో, దరఖాస్తుదారులకు ఉపశమనం కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని అన్నారు. టెట్-2024లో అర్హత సాధించని అభ్యర్థులకు వచ్చే టెట్‌లో ఉచిత దరఖాస్తు అవకాశాన్ని కల్పించడం, టెట్-2024లో అర్హత సాధించిన వారికి డీఎస్సీ ఉచిత దరఖాస్తు అవకాశాన్ని కల్పించడం వంటి నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంది.
ఇంకా చదవండి: AP EAPCET 2024 ఫలితాలు విడుదల! మీ మార్కులు వెంటనే చెక్ చేసుకోండి!
మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
ఏపీ మంత్రివర్గంలోకి కొత్త ఎమ్మెల్యేలు! తొలిసారి గెలిచిన వారికి పెద్దపీట!
చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి! వివిధ దేశాల నుండి ప్రతినిధులకు ఆహ్వానం!
జనసేన పార్టీ ఎమ్మెల్యేలతో పవన్ కీలక సమావేశం! JSP LP అభ్యర్థి ఎన్నికపై సంచలన నిర్ణయం!
పెమ్మసాని గతంలో నిర్వహించిన వివిధ హోదాలు! గుంటూరు గర్వించే విజయం! అమరావతికి సముచిత స్థానం!
వైద్య విద్యార్థులకు ఆన్‍లైన్ శిక్షణ! 'యు వరల్డ్' ప్రారంభించిన ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: