నెల రోజులుగా క్రికెట్ అభిమానులను అలరించిన T20 ప్రపంచకప్ 2024 చివరి మ్యాచ్‌కు సిద్ధమైంది. ఫైనల్లో భారత్ మరియు సౌతాఫ్రికా జట్లు తాడోపేడో తేల్చుకోనున్నాయి. బార్బడోస్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో, టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇరు జట్లు మార్పులు లేకుండానే బరిలోకి దిగుతున్నాయి.
ఇంకా చదవండి: SIM స్వాపింగ్ స్కామ్‌లకు చెక్ పెట్టేందుకు! TRAI సరికొత్త నిబంధనలు! జులై 1 నుంచి అమల్లోకి!
ఫైనల్లో ఉండే ఒత్తిడి సహజం. భారత్‌పై ఎలాంటి ఒత్తిడి ఉంటుందో, సౌతాఫ్రికాపైనా అటువంటి ఒత్తిడి ఉంటుంది. గత రెండు ఐసీసీ టోర్నీల్లో భారత్ ఫైనల్ చేరినా టైటిల్ నెగ్గలేదు. 2023లో జరిగిన వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్, వన్డే ప్రపంచకప్ ఫైనల్లో కూడా తుది మెట్టుపై భారత్ ఓడింది. ఈ సారి ఫైనల్లో నెగ్గాలంటే టీమిండియా అలసత్వాన్ని ప్రదర్శించరాదు.
విరాట్ కోహ్లీ ఫామ్‌లో లేకపోవడం టీమిండియాకు ప్రతికూలంగా ఉంది. గత రెండు మ్యాచ్‌ల్లో రిషభ్ పంత్ పెద్దగా ఆడలేదు. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాల బ్యాటింగ్‌పై అధికంగా ఆధారపడుతున్నారు. బౌలింగ్ విభాగం మాత్రం అద్భుతంగా ఉంది. ఫైనల్లో విజయం సాధించాలంటే 11 మంది అద్భుతంగా ఆడాల్సి ఉంటుంది.
ఇంకా చదవండి: వాట్సాప్ లేటెస్ట్ అప్డేట్! గ్రూప్ చాట్స్‌లో కొత్త ఈవెంట్ ఫీచర్! ఎలా పని చేస్తుందో చూడండి!
దక్షిణాఫ్రికా జట్టు కూడా అద్భుతంగా ఆడుతుంది. బౌలింగ్ వారి బలం. చోకర్స్ అనే పేరు ఉన్నప్పటికీ, ఈ సారి దానిని చెరిపేసుకుంటుందో లేదో చూడాలి.
బార్బడోస్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. సూపర్ 8లో ఆడిన పిచ్‌ల కంటే కూడా ఇది బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉందని పిచ్ రిపోర్ట్‌లో తెలిపింది. రెండో ఇన్నింగ్స్‌లో పిచ్ స్లో అయ్యే అవకాశం ఉంది. అందుకే టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.
ఇంకా చదవండి: నకిలీ పత్రాలతో అమెరికా కాలేజీలో అడ్మిషన్! భారత విద్యార్థి అరెస్టు, 20 ఏళ్ల జైలు శిక్ష!
తుది జట్లు
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్ దీప్ సింగ్
దక్షిణాఫ్రికా జట్టు: క్వింటన్ డికాక్, మార్క్రమ్ (కెప్టెన్), క్లాసెన్, స్టబ్స్, డేవిడ్ మిల్లర్, మార్కో యాన్సెన్, కేశవ్ మహరాజ్, రబడ, నోకియా, షమ్సీ
ఇంకా చదవండి: రాజధాని కోసం మరోసారి భూములు ఇచ్చేందుకు సిద్ధం! అమరావతి రైతుల పెద్ద మనసు!
మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు ఇవే!
అమెరికాలో తెలుగువారి డామినేషన్! యూనివర్సిటీలలో తెలుగులో స్వాగతం!
జూన్ 30 అర్థరాత్రి నుండి IPC చట్టాలకు విరామం! జులై 1 నుండి కొత్త క్రిమినల్ చట్టాలు అమలు!
శాంసంగ్ నుంచి తొలిసారిగా మ్యూజిక్ ఫ్రేమ్ లాంచ్! సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది! ఎక్కడ కొనుగోలు చేయాలి?
అమరావతికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయం! రిటైర్డ్ ఐఏఎస్ లక్ష్మికి కీలక బాధ్యతలు!
2024లో ఆపిల్ నుండి iPhone 16 సిరీస్! ధర, విడుదల తేదీ వివరాలు!
మీ వద్ద తెల్ల రేషన్ కార్డు ఉందా! కేంద్రప్రభుత్వ పథకాలన్నీ ఉపయోగించుకుంటున్నారా?
జులై 1న అవ్వాతాతలు, వికలాంగుల కళ్లల్లో కొత్త వెలుగులు! అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: