పాట్ కమిన్స్ నాయకత్వంలోని సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్ 17వ సీజన్ లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. రాజస్థాన్ రాయల్స్ తో చెన్నైలో జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్ లో సన్ రైజర్స్ 36 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ విజయం తో ఫైనల్ చేరిన సన్ రైజర్స్... ఈ నెల 26న జరిగే టైటిల్ సమరంలో కోల్ కతా నైట్ రైడర్స్ తో తలపడనుంది. ప్లేఆఫ్స్ లో కోల్ కతాతో క్వాలిఫయర్-1లో ఓడిపోయిన సన్ రైజర్స్... ఫైనల్లో ప్రతీకారం తీర్చుకుంటుందా? అనే అంశం ఆసక్తి కలిగిస్తోంది. ఫైనల్ మ్యాచ్ కూడా చెన్నైలోనే జరగనుంది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇక నేటి క్వాలిఫయర్-2 మ్యాచ్ విషయానికొస్తే... చెన్నై ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 175 పరుగులు చేసింది. అనంతరం, లక్ష్యఛేదనలో రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 139 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. సన్ రైజర్స్ స్పిన్నర్లు షాబాజ్ అహ్మద్, అభిషేక్ శర్మ అద్భుతంగా బౌలింగ్ చేసి మ్యాచ్ ను మలుపుతిప్పారు. కెప్టెన్ పాట్ కమిన్స్ 1, టి.నటరాజన్ 1 వికెట్ తీసి జట్టు విజయంలో తమ వంతు సహకారం అందించారు.
రాజస్థాన్ ఇన్నింగ్స్ లో ధ్రువ్ జురెల్ 56 (నాటౌట్) పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 42 పరుగులు చేశాడు. ఓపెనర్ టామ్ కోహ్లర్ కాడ్మోర్ (10), కెప్టెన్ సంజు శాంసన్ (10), రియాన్ పరాగ్ (6), రవిచంద్రన్ అశ్విన్ (0), షిమ్రోన్ హెట్మెయర్ (4), రోమాన్ పావెల్ (6) విఫలమయ్యారు.
ఇవి కూడా చదవండి:
58 లోక్‌సభ స్థానాలకు మొదలైన పోలింగ్! 6వ దశ పోలింగ్ షురూ! 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో!
హ్యూమన్ ట్రాఫికింగ్ బారిన పడిన యువత! రక్షించి విశాఖ చేర్చిన పోలీసులు! చంద్రబాబు X లో పోస్ట్!
ఈవీఎం ధ్వంసం ఘటనపై సిట్ స్పెషల్ ఫోకస్! వీడియో లీక్ పై విచారణ! చీఫ్ వినీత్ బ్రిజ్ లాల్ నేతృత్వంలో!
ఎవరెస్టు పర్వతంపై టీడీపీ జెండా! అనంతపురం యువకుడికి లోకేష్ 20 లక్షల సాయం! ధన్యవాదాలు తెలిపిన ఉపేంద్ర!
సింగపూర్: గ్లోబల్ ర్యాంకింగ్‌లో 50 ఉత్తమ నగరాల్లో! సౌత్-ఈస్ట్ ఆసియా లో ఏకైక నగరం! లండన్ కూడా!
జయ బాడిగకు చంద్రబాబు అభినందనలు! కాలిఫోర్నియాలో తొలి మహిళా జడ్జిగా! విజయవాడ వారు కావడం గర్వకారణం!
వైరల్ అవుతున్న ఇన్ స్టా వీడియో! విద్యార్థితో కలసి సరదాగా టీచర్ డ్యాన్స్! 1.3 కోట్ల వ్యూస్!
హైదరాబాద్ ఫేమస్ రెస్టారెంట్ లో కల్తీ! నటుడు బ్రహ్మాజీ ఫన్నీ కామెంట్స్! నెటిజన్ల రియాక్షన్ ఇదే!
తీవ్ర విషాదం... విరిగిపడిన కొండచర్యలు! 100 మందికి పైగా మృతుల సంఖ్య! ఎక్కడ అంటే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: