హోమ్ లోన్: ఇళ్ల ధరలు ఎక్కువగా ఉండటం వలన కొత్త ఇల్లు, అపార్ట్‌మెంట్ కొనాలంటే ప్రస్తుత రోజుల్లో బ్యాంకుల్లో లోన్ తీసుకోవాల్సి వస్తోంది. హోమ్ లోన్ త్వరగా వచ్చేందుకు ఏ బ్యాంకులో వేగంగా లోన్ ప్రాసెస్ అవుతుందో, దానినే ఎంపిక చేసుకోవడం మంచిది. దాంతో పాటుగా తక్కువ వడ్డీ రేటు ఇచ్చే బ్యాంకులను ఎంచుకోవడం తెలివైన ఎంపికగా చెప్పవచ్చు. వడ్డీ రేటులో స్వల్ప తేడా ఉన్నా మెచ్యూరిటీ నాటికి వడ్డీ మొత్తంలో చాలా తేడా కనిపిస్తుంది. 10 బేసిస్ పాయింట్ల తో తక్కువ వడ్డీ రేటు ఉన్నా బ్యాంకుకే ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు సూచిస్తుంటారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఉదాహరణకు 9.8 శాతం వడ్డీపై రూ. 50 లక్షల హోమ్ లోన్ తీసుకుంటే.. 10 ఏళ్ల వరకు ప్రతి నెలా రూ. 65,523 ఈఎంఐ చెల్లించాలి. అదే వడ్డీ రేటు 10 శాతం ఉంటే రూ. 66,075 ఈఎంఐ చెల్లించాల్సి వస్తుంది. ఇక్కడ తేడా 20 బేసిస్ పాయింట్లే అయినా పదేళ్లకు రూ. 66,240 అధికంగా చెల్లించాల్సి వస్తుంది. అందుకే తక్కువ వడ్డీ రేటు ఉండే బ్యాంకులనే ఎంపిక చేసుకోవాలి. ప్రస్తుతం తక్కువ వడ్డీకే హోమ్ లోన్ ఇచ్చే టాప్-5 బ్యాంకుల జాబితా తెలుసుకుందాం.
1. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్: దేశంలోని అతిపెద్ద ప్రైవేటు బ్యాంకైన హెచ్‌డీఎఫ్‌సీలో హోమ్ లోన్ వడ్డీ రేట్లు 9.4 శాతం నుంచి 9.95 శాతం వరకు ఉన్నాయి.
2. ఎస్‌బీఐ: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో హోమ్ లోన్ వడ్డీ రేట్లు 9.15 శాతం నుంచి 9.75 శాతం మధ్య ఉన్నాయి. రుణ గ్రహీత సిబిల్ స్కోరు బట్టి వడ్డీ రేట్లలో తేడా ఉంటుంది. సిబిల్ 750 కంటే ఎక్కువగా ఉంటే తక్కువ వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తుంటాయి బ్యాంకులు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
3. ఐసీఐసీఐ బ్యాంక్: ఈ బ్యాంకులో హోమ్ లోన్ వడ్డీ రేటు 9.40 శాతం- 10.05 శాతం మధ్య ఉంది. స్వయం ఉపాధి పొందేవారికి రూ. 35 లక్షల లోపు లోన్లకు 9.40 శాతం నుంచి 9.80 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది. ఉద్యోగస్తులకు వడ్డీ రేటు 9.25 శాతం నుంచి 9.65 శాతం మధ్య ఉంది. అదే రూ. 35 లక్షల నుంచి రూ. 75 లక్షల వరకు లోన్లపై ఉద్యోగులకు 9.5 శాతం నుంచి 9.8 శాతం వరకు ఆఫర్ చేస్తోంది.
4. పీఎన్‌బీ: పంజాబ్ నేషనల్ బ్యాంకులో హోమ్ లోన్ వడ్డీ రేటు 9.4 శాతం మొదలవుతున్నాయి. గరిష్ఠంగా 11.6 శాతం వరకు వసూలు చేస్తోంది. మంచి సిబిల్ స్కోరు ఉన్న వారికి వడ్డీ రేటులో రాయితీ కల్పిస్తోంది.
5. పీఎన్బీ హౌసింగ్: ఈ బ్యాంకులో హోమ్ లోన్ వడ్డీ రేటు 8.5 శాతం నుంచి 11.25 శాతం వరకు ఉన్నాయి. ఉద్యోగులకైతే 8.5 నుంచి 9 శాతం వరకు వడ్డీ ఆఫర్ చేస్తోంది బ్యాంక్. సిబిల్ స్కోరు ఎక్కువగా ఉంటే ఇది వర్తిస్తుందని గుర్తుంచుకోవాలి.
ఇవి కూడా చదవండి:
తాడేపల్లి ప్యాలెస్ లో వాస్తు సిద్ధాంతులు! జగన్ ను పీడిస్తున్న ఆ భయం నిజమేనా?
ట్యాక్స్ పేయర్లకు బిగ్ అలర్ట్! మే నెలలో ముఖ్యమైన డెడ్‌లైన్స్! ఇవి మిస్ అయితే తిప్పలే!
రోజా కి తీవ్రమైన ఎదురుదెబ్బ! ఆమె దెబ్బకి వైసీపీ మొత్తం రాజీనామా!
శ్రీలంక: టూరిస్టులకు శుభవార్త! భారత్ తో పాటు ఏడు దేశాల వారికి మే ఆఖరి వరకు వీసా అవసరం లేదు!
గోల్డ్ లోన్ తీసుకున్నారా! వడ్డీ ఎక్కువ కట్టించుకునే అవకాశం ఉంది! ఈ జాగ్రత్తలు పాటిస్తే నీకే ఉపయోగ!
జగన్ సతీమణికి మరో చేదు అనుభవం! ఆ ఘటనతో ప్రచారానికి భయపడుతున్న భారతి!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి