ఆలయ ప్రవేశం - ప్రదక్షణం
సాధారణంగా ఆలయంలో ప్రధాన ద్వారం వద్ద, గర్భగుడిలోకి వెళ్లేముందు ఉన్న గడపలు రాయితో తయారు చేసి ఉంటారు. ఈ గడపకు ప్రతి భక్తుడూ నమస్కరిస్తుంటాడు. ఇలా ఎందుకు నమస్కరిస్తారనే విషయం చాలా మంది భక్తులకు తెలియదు. వాస్తవానికి గృహాలకు చెక్కతో తయారు చేసిన గడప ఉంటుంది. అలాగే, ఆలయాలకు అయితే రాయితో తయారు చేసిన గడప ఉంటుంది.
ఆలయాలకు రాతితోనే ఎందుకు గడపను తయారు చేస్తారు? ఆ ఆలయ గడపకు ఎందుకు నమస్కరించాలి అనే అంశాలను పరిశీలిస్తే…
రాయి పర్వతానికి చెందినది. భద్రుడు అనే ఋషి భద్రమనే పర్వతంగానూ, హిమవంతుడు అనే భక్తుడు హిమాలయముగానూ, నారాయణుడు అనే భక్తుడు నారాయణాద్రిగానూ అవతరించారని పురాణాలు చెపుతున్నాయి. ఈ ఆ భక్తుల కోసం భగవంతుడు కూడా ఆ కొండలమీదే వెలిశాడు. అందుకే ఆ కొండ రాళ్ళ నుంచి వచ్చిన రాయినే మలిచి ఆలయ గర్భగుడులకు గడపగా పెట్టారని శాస్త్రాలు చెపుతున్నాయి.
ఆ గడప నిత్యం దైవాన్ని దర్శిస్తూ ఉంటుంది. అలా ఆ గడప రాయి పుణ్యం చేసుకుంది. అందుకే ఆ గడప రాయి చేసుకున్న పుణ్యానికి నమస్కరిస్తూ, కొండ రాయిగా మారిన భక్తుడిని దాటుతున్నందుకు క్షమించమని, మన్నించమని వేడుకోవడమే గడపకు నమస్కరిస్తారని పురాణాలు చెపుతున్నాయి. అందుకే ఆలయాల్లో ప్రధాన గడప తొక్కకుండా, కేవలం దాటాలని ఆధ్యాత్మిక వేత్తలు సూచిస్తున్నారు.
మనము దేవాలయమునకు వెళ్ళాలనుకున్నప్పుడు, స్వామివారిని దర్శించడానికి ముందు దేవాలయంలో ప్రదక్షిణించడంలో తొందర పనికిరాదు.
మనస్సును ప్రశాంతపరచి, స్వామివారిని మనస్సును ధ్యానిస్తూ మంత్రం గాని, అష్టోత్తరం గాని, ఇవి ఏవి తెలియని వారు ఆ స్వామివారి నామజపము చేస్తూ భక్తితో ఆ దైవం చుట్టూ ప్రదక్షిణ చేయాలి. ఆలయంలోని గర్భగుడిలో దేవతా విగ్రహం ఉంటుంది. ప్రతి నిత్యం పురోహితులు జరిపే అర్చనలలోని మంత్రాల ద్వారా ఆ మంత్రాలలో ఉండే శక్తిని విగ్రహం క్రిందనున్న యంత్రం ఆ శక్తిని గ్రహించి, ఆ శక్తి ద్వారా మన కోర్కెలను తీరుస్తుంది.
కనుక భగవదర్శనానికి వెళ్ళినప్పుడు మన మది నిండా భగవంతుని రూపమే నింపి నిదానంగా ప్రదక్షిణ చేసి ఆ స్వామి కృపకు పాత్రులు కావాలి.
రచయిత : కాపెర్ల పవన్ కుమార్, 9908300831
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి
యాత్ర తరంగిణి 7: ఆలయం లోపల భాగంలో ఉండే ప్రదేశాలు! వాటి విశిష్టత!
యాత్ర తరంగిణి 6: దేవాలయాల ఎప్పుడు? ఎక్కడ ప్రతీష్టించాలి? శాస్త్రం ఏం చెబుతుంది?
యాత్రా తరంగిణి 5: ప్రతి దేవాలయం ఎందుకు అలా ఉంటుంది? సైన్స్ దాగుందా?
యాత్రా తరంగిణి 4: దేవాలయాల నిర్మాణం వెనుక ఉన్న అసలు కారణం
యాత్ర తరంగణి 3: దేవాలయం లోపల పాటించవలసిన కనీస నియమ నిబంధనలు
యాత్ర తరంగణి 2: దేవాలయాలు ఎన్ని రకాలు, వాటి నిర్మాణాలు ఎలా ఉంటాయి, ఉపయోగాలు ఏమిటి...
యాత్రా తరంగిణి 1 -గుడి లో సాష్టాంగ నమస్కారం, ప్రదక్షిణం తప్పనిసరా...