అదిరిపోయే గుడ్ న్యూస్. ఏంటని అనుకుంటున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే. కనీసం 10 వ తరగతి చదివితే చాలు భవిష్యత్తు కు భరోసానిచ్చే శిక్షణ మన తిరుపతి జిల్లాలో ఏర్పాటు.. అది కూడా యూనియన్ బ్యాంక్ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. తిరుపతి జిల్లా,చంద్రగిరి మండలంలోని యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ చంద్రగిరిలో 14వ తేది (బుధవారం) నుంచి 30 రోజుల పాటు ఉచిత శిక్షణ ఉంటుంది. పురుషులకు రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండిషన్( ఏసీ) రిపేరు, సర్వీసింగ్ పై ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు సంస్థ డైరెక్టర్ పి.సురేష్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన తిరుపతి, చిత్తూరు జిల్లా గ్రామీణ ప్రాంతానికి చెందిన 19 నుంచి 45 ఏళ్లలోపు నిరుద్యోగ పురుషులు అర్హులన్నారు. కనీసం విద్యార్హత 10వ తరగతి చదివి ఉండాలని, శిక్షణ సమయంలో అభ్యర్థు లకు ఉచిత భోజనం, రానూ పోనూ ఒకసారి చార్జీకి నగదు ఇవ్వనున్నట్టు తెలియజేశారు. అభ్యర్థులు ఆధార్, రేషన్ కార్డు జిరాక్స్ లు , 4 పాస్పోర్ట్ సైజు ఫొటోలతో సంస్థకు వచ్చి పేర్లు నమోదు చేసుకో వాలని కోరారు. తొలుత పేర్లు నమోదు చేసుకున్న వారికి ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ, 11-48 ద్వారకా నగర్ (రాయల్ విక్టరీ స్కూల్ దగ్గర) కొత్తపేట, చంద్రగిరి. ఫోన్: 7989680587, 94949 51289, 83091 64644 సంప్రదించాలని ప్రకటనలో కోరారు.
ఇంకా చదవండి: విద్యార్థులకు చంద్రబాబు గుడ్ న్యూస్! ఒక్కొక్కరికి రూ.80 వేలు! మరో వైపు తల్లికి వందనం స్కీమ్ అమలు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
బాల నటిగా ఎంట్రీ.. వ్యభిచారం కేసులో అరెస్ట్! ఈ హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందంటే!
ఇల్లు లేని వారికి శుభవార్త! కీలక ప్రకటన చేసిన కేంద్రం! ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథక ప్రయోజనాలు!
మందుబాబులకు గుడ్ న్యూస్! ఏపీలో భారీగా మద్యం ధరలు తగ్గింపు! కొత్త రేట్లు ఇవే?
సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం! కోడలి చేతిలో పార్టీ బాధ్యతలు?
బైక్, స్కూటర్ నడిపే వారికి హెచ్చరిక! కొత్త ట్రాఫిక్ రూల్స్! భారీ ఫైన్ - జైలుకు పోయే పరిస్థితి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: