నిన్న అర్ధరాత్రి అక్రమ సంబంధంపై తనను ప్రశ్నించేందుకు వచ్చిన భార్య, కుమార్తెలపై దాడికి పాల్పడిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇవాళ వారిపై హత్యాయత్నం ఫిర్యాదు చేశారు. నిన్న రాత్రి తన ఇంటికి వచ్చిన భార్య, కుమార్తెపై బూతులతో విరుచుకుపడిన ఆయన.. కర్రతో దాడికి కూడా ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయన్ను అడ్డుకుని వారికి అక్కడి నుంచే పంపేశారు. దువ్వాడ శ్రీనివాస్ వైఖరిపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం స్వయంగా టెక్కలి పీఎస్ కు వెళ్లిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అక్కడ సీఐకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. భార్య వాణి, ఆమె కుమార్తె హైందవి అర్ధరాత్రి తన ఇంటికి అనుచరులతో వచ్చి దాడికి పాల్పడ్డారని, హత్యాయత్నం చేశారని ఆయన ఆరోపించారు.
ఇంకా చదవండి: వైఎస్ జగన్ కు స్పీకర్ అయ్యన్నపాత్రుడు బంపర్ ఆఫర్! తిరస్కరిస్తే - ఇక ఎమ్మెల్యే సీటు కూడా పోయినట్టేనా?
వీరిని వెంటనే అరెస్టు చేసి తనకు రక్షణ కల్పించాలని పోలీసులకు చేసిన ఫిర్యాదులో కోరారు. దీంతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగినట్లయింది. ఇప్పటికే దువ్వాడ శ్రీనివాస్ అక్రమ సంబంధం విషయంలో ఇంత రచ్చ జరుగుతున్నా స్పందించని పోలీసులు.. ఇప్పుడు ఆయన ఫిర్యాదుపై ఏం చేస్తారో చూడాలి. మరోవైపు అర్ధరాత్రి దువ్వాడ వ్యవహారశైలిపై భార్య, కుమార్తె ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్ తో ఉంటున్న మాధురి తనకు పెళ్లయిందని, విడాకులు కాలేదని చెప్తోందని కుమార్తె హైందవి తెలిపారు. అలాగే తన తల్లి వాణితో కూడా విడాకులు కాలేదని చెప్తోందన్నారు. దీన్నిబట్టి తన తండ్రి దువ్వాడ శ్రీనివాస్ వ్యక్తిత్వం అర్ధమవుతోందన్నారు. మాధురి, శ్రీనివాస్ మధ్య సాగిన పలు వాట్సాప్ చాటింగ్స్ లను కూడా బయటపెట్టారు.
ఇంకా చదవండి: వాలంటీర్లకు భారీ శుభవార్త చెప్పిన ప్రభుత్వం - ఉద్యోగం పై క్లారిటీ! వారికి త్వరలోనే రూ.10 వేలు జీతం!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్ - రూ 4,109 కోట్ల ప్రాజెక్టు! అందుబాటులోకి ఇలా - వేలల్లో ఉద్యోగాలు!
ఎమ్మెల్సీ ఎన్నిక వేళ వైసీపీకి మరో షాకిచ్చిన గంటా! త్వరలో జరిగేది ఇదే! ఇప్పుడు జగన్ పరిస్థితి ఏంటి?
కుప్పం, పుంగనూరులో ఆ పనులు చెయ్యండి! ఎంతైనా పర్వాలేదు, చంద్రబాబు ఆర్డర్!
డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! ఒక్కొక్కరికి రూ.5 లక్షలు!
విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, లక్షల రూపాయలు! విజయవాడలో స్కూల్ సంచలనం!
జగన్ పై కేసులు పెట్టాలని మంత్రి డిమాండ్! సైకో ప్రభుత్వంలో హత్యా రాజకీయాలు!
మహిళలతో కలిసి డ్యాన్స్ చేసిన సీఎం చంద్రబాబు! వైరల్ వీడియో!
ఈ సమస్యలు ఉన్నవారు టమాటాలు తినకూడదా! వైద్య నిపుణులు ఏం చెప్తున్నారంటే!
వైసీపీకి ఊహించని షాక్! మాజీ డిప్యూటీ సీఎం రాజీనామా!
ఏపీలో ఆగస్టు 15న జెండా ఎగరేసే మంత్రులు వీరే! చంద్రబాబు, పవన్ ఎక్కడంటే?
పవన్ విజ్ఞప్తితో ఏపీకి నిధులిచ్చిన మోడీ! అదనంగా రూ.2812.98 కోట్ల - ఇక వారికి పండగే పండగ!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: