ఏపీలో ఎన్డీయే కూటమి వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయకుండా కొనసాగిస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అంతే కాదు వారి జీతాలు కూడా పెంచుతామన్నారు. ఆ దిశగానే ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇటీవల దీనిపై సాంఘిక సంక్షేమ శాఖామంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి స్పందించారు. ఏపీలో వాలంటర్ వ్యవస్థను తొలగిస్తామంటూ వస్తున్న ప్రచారాన్ని మంత్రి బాల వీరాంజనేయస్వామి ఖండించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. వాలంటీర్లను వైసీపీ ప్రభుత్వం రాజకీయంగా వాడుకుందన్నారు. వారి భవిష్యత్తును దెబ్బకొంట్టేందుకు ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వం ఏడాది కాలంగా వాలంటీర్ సేవలను రెన్యూవల్ చేయకుండా వారిని మోసం చేశారన్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా దీనిపై మరోసారి స్పదించారు. వాలంటీర్ల ఉద్యోగాలను రెన్యువల్ చేయనున్నట్లు మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి ప్రకటించారు. 2023 ఆగస్టు నుంచి వాలంటీర్ల ఉద్యోగాలను గత వైసీపీ ప్రభుత్వం ఎందుకు రెన్యువల్ చేయలేదని ప్రశ్నించారు. వాలంటీర్లను తాము తొలగించలేదని, వైఎస్ జగన్ చేసిన పాపం వల్లే వారికి జీతాలు రావడం లేదని అన్నారు. ఇదిలా ఉండగా.. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు రూ.10 వేలు వేతనం ఇస్తామని టీడీపీ కూటమి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. వారికి త్వరలోనే రూ.10 వేలు జీతం ఇవ్వనున్నట్లు సమాచారం.
ఇంకా చదవండి: ఎమ్మెల్సీ ఎన్నిక వేళ వైసీపీకి మరో షాకిచ్చిన గంటా! త్వరలో జరిగేది ఇదే! ఇప్పుడు జగన్ పరిస్థితి ఏంటి?
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఎమ్మెల్సీ ఎన్నిక వేళ వైసీపీకి మరో షాకిచ్చిన గంటా! త్వరలో జరిగేది ఇదే! ఇప్పుడు జగన్ పరిస్థితి ఏంటి?
కుప్పం, పుంగనూరులో ఆ పనులు చెయ్యండి! ఎంతైనా పర్వాలేదు, చంద్రబాబు ఆర్డర్!
డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! ఒక్కొక్కరికి రూ.5 లక్షలు!
విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, లక్షల రూపాయలు! విజయవాడలో స్కూల్ సంచలనం!
జగన్ పై కేసులు పెట్టాలని మంత్రి డిమాండ్! సైకో ప్రభుత్వంలో హత్యా రాజకీయాలు!
మహిళలతో కలిసి డ్యాన్స్ చేసిన సీఎం చంద్రబాబు! వైరల్ వీడియో!
ఈ సమస్యలు ఉన్నవారు టమాటాలు తినకూడదా! వైద్య నిపుణులు ఏం చెప్తున్నారంటే!
వైసీపీకి ఊహించని షాక్! మాజీ డిప్యూటీ సీఎం రాజీనామా!
ఏపీలో ఆగస్టు 15న జెండా ఎగరేసే మంత్రులు వీరే! చంద్రబాబు, పవన్ ఎక్కడంటే?
పవన్ విజ్ఞప్తితో ఏపీకి నిధులిచ్చిన మోడీ! అదనంగా రూ.2812.98 కోట్ల - ఇక వారికి పండగే పండగ!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: