విశాఖపట్నంకు త్వరలోనే మెట్రో రైల్ వ్యవస్థ, ఫ్లై ఓవర్లు రానున్నాయని టీడీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. విశాఖ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కూటమిదే విజయం అని ధీమా వ్యక్తం చేశారు. విశాఖలో భూ కుంభకోణాలపై సమగ్ర దర్యాప్తు చేస్తామని వెల్లడించారు. వైజాగ్ ఫైల్స్ పై త్వరలోనే పూర్తి నివేదిక వస్తుందని, విశాఖ భూ కుంభకోణాలను బయటపెడతామని అన్నారు. అక్రమార్కులను వదిలే ప్రసక్తే లేదని అన్నారు. దోషులకు శిక్ష తప్పదని పేర్కొన్నారు. రుషికొండ భవనాలపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని గంటా తెలిపారు. "నిన్నటి విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి సభ్యుల విజయం రాబోయే అన్ని ఎన్నికల్లో మా విజయానికి నాంది. విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిని త్వరలోనే ప్రకటిస్తాం. గతంలో విపక్ష నేతగా ఉన్న చంద్రబాబును జగన్ అవహేళన చేశారు. 23 మంది ఎమ్మెల్యేల్లో సగం మందిని లాగేసుకుంటే చంద్రబాబుకు ప్రతిపక్ష నేత పోదా అని జగన్ వ్యాఖ్యానించలేదా? ఇప్పుడు జగన్ పరిస్థితి ఏంటి? జగన్ ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే... విపక్ష నేత కాదు. వైసీపీకి ప్రజలు 11 స్థానాలు ఇచ్చారు... అయినప్పటికీ వైసీపీకి మేం గౌరవం ఇస్తున్నాం. మేం గనుక గేట్లు తెరిచామంటే వైసీపీ ఖాళీ అవడం ఖాయం" అని గంటా వ్యాఖ్యానించారు.
ఇంకా చదవండి: 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు.. వీరికి భారీ షాక్! అమలులో కొత్త ట్విస్ట్! ఎవరు అర్హులు?
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
కేంద్రం గుడ్‌న్యూస్.. ఉచితంగా కుట్టుమిషన్! ఇలా దరఖాస్తు చేసుకోండి! లేట్ అయితే అవకాశం మిస్ అవ్వచ్చు!
పాస్ పోర్ట్ ఇలా కూడా నిరాకరిస్తారా? బ్రిటన్ లో ఓ పాపకు వింత అనుభవం! ఇలా మీకు కూడా జరగవచ్చు!
ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం! టీటీడీ చైర్మన్ గా ఆయన పేరు ఫిక్స్!
వైసీపీకి మరో బిగ్ షాక్! జనసేనలోకి ఆ ప్రాంతం మాజీ ఎమ్మెల్యే!
యూకే వెళ్తున్న భారతీయులకు విదేశాంగ శాఖ హెచ్చరిక! కారణం ఏంటంటే!
తహసీల్దార్ కార్యాలయంలో దస్త్రాల కక్కలు! 25 ఎకరాల భూమి ఆక్రమణపై ఎత్తుగడ!
రోజా కి మొదలైన టార్చర్! పాలిటిక్స్ లో కాదు సినిమాల్లో కూడా కనపడకుండా! రాజీనామా కి రెడీగా ఉందా!
వైసీపీ ఎమ్మెల్సీ భరత్ పై పోలీసు కేసు! అసలు ఏం చేశాడో తెలుసా? ఇలాంటివాడికి ఏ శిక్ష వేసినా తక్కువే!
48 గంటల్లో అకౌంట్లలోకి డబ్బులు! సీఎం చంద్రబాబు భారీ శుభవార్త! ఇక ఆ పథకాలు కూడా లైన్ లోకి!
వాలంటీర్లకు భారీ శుభవార్త.. కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: