ఆంధ్రప్రదేశ్‌లో 2024 ఎన్నికలకు ముందు ఇచ్చిన కీలక హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చేందుకు సిద్ధమైంది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గించడానికి దీపం పేరిట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం- 2024 ప్రారంభించనుంది. ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరిచే లక్ష్యంతో ఈ స్కీమ్ రూపొందించింది. ఈ పథకం కింద, అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తారు. ఈ పథకం కోసం దరఖాస్తుదారులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు, ప్రభుత్వ ఆఫీస్‌లకు వెళ్లాల్సిన అవసరం లేదు. డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్ ఉన్నవారికి, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారికి మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 1.30 కోట్ల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. వీటిలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి అర్హులైన వారిని గుర్తించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అవసరమైన డాక్యుమెంట్లు.. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి అప్లై చేయడానికి కొన్ని కీలక డాక్యుమెంట్లు అవసరం. ఆధార్ కార్డ్, రేషన్ కార్డు, మొబైల్ నంబర్, విద్యుత్ బిల్లు, అడ్రస్ ప్రూఫ్, పాన్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలి.
ఇంకా చదవండి: ఆ ప్రాంతం నుండి జనసేనలోకి భారీగా చేరికలు! ఆనందంలో డిప్యూటీ సీఎం!
ఎవరు అర్హులు?
ఈ స్కీమ్ కింద సిలిండర్లు ఉచితంగా పొందడానికి కొన్ని అర్హతలు ఉండాలి. ఆంధ్రప్రదేశ్‌లో శాశ్వత నివాసిగా ఉండాలి. అలానే ఇంట్లో ఒకే LPG గ్యాస్ కనెక్షన్ కలిగి ఉండాలి. రాష్ట్రంలో ఆర్థికంగా వెనకబడిన వర్గానికి చెందిన కుటుంబాలు, డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్ ఉన్నవారు మాత్రమే అర్హులు. ఈ అర్హతలు లేని వారికి ఈ స్కీమ్ వర్తించదు. లబ్ధిదారులకు ప్రయోజనాలు అర్హుత ఉన్న ప్రతి దరఖాస్తుదారునికి సంవత్సరానికి మొత్తం మూడు LPG గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందుతాయి. దీంతో ప్రజల ఇంటి ఖర్చులు భారీగా తగ్గుతాయి. ఈ పొదుపును ఇతర అవసరాలకు వినియోగించుకోవచ్చు.
ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి?
లబ్ధిదారులు ఆన్‌లైన్‌లో, అధికారిక వెబ్‌సైట్(ప్రభుత్వం త్వరలో ప్రత్యేక వెబ్‌సైట్ లాంచ్ చేయనుంది)ను సందర్శించి అప్లై చేసుకోవచ్చు. వెబ్‌సైట్ హోమ్‌పేజీలో ‘అప్లై హియర్’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ఇప్పడు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ అడిగిన అన్ని వివరాలను నింపండి. అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయండి. వివరాలను రివ్యూ చేసి, ‘సబ్మిట్’ బటన్‌పై క్లిక్ చేయండి. అప్లికేషన్ ప్రాసెస్ పూర్తవుతుంది. అయితే ఈ పథకాన్ని ఏ తేదీ నుంచి అమలు చేస్తారనే విషయమై ప్రభుత్వం త్వరలోనే అధికారికంగా ప్రకటన చేయనుంది. మరోవైపు, ఈ స్కీమ్ కింద ఉచితంగా సిలిండర్లు అందడానికి కేవైసీ ప్రాసెస్ కోసం గ్యాస్ ఏజెన్సీల్లో ఎవరైనా డబ్బులు తీసుకుంటే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చిరిస్తున్నారు.
ఇంకా చదవండి: కేంద్రం గుడ్‌న్యూస్.. ఉచితంగా కుట్టుమిషన్! ఇలా దరఖాస్తు చేసుకోండి! లేట్ అయితే అవకాశం మిస్ అవ్వచ్చు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
పాస్ పోర్ట్ ఇలా కూడా నిరాకరిస్తారా? బ్రిటన్ లో ఓ పాపకు వింత అనుభవం! ఇలా మీకు కూడా జరగవచ్చు!
ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం! టీటీడీ చైర్మన్ గా ఆయన పేరు ఫిక్స్!
వైసీపీకి మరో బిగ్ షాక్! జనసేనలోకి ఆ ప్రాంతం మాజీ ఎమ్మెల్యే!
యూకే వెళ్తున్న భారతీయులకు విదేశాంగ శాఖ హెచ్చరిక! కారణం ఏంటంటే!
తహసీల్దార్ కార్యాలయంలో దస్త్రాల కక్కలు! 25 ఎకరాల భూమి ఆక్రమణపై ఎత్తుగడ!
రోజా కి మొదలైన టార్చర్! పాలిటిక్స్ లో కాదు సినిమాల్లో కూడా కనపడకుండా! రాజీనామా కి రెడీగా ఉందా!
వైసీపీ ఎమ్మెల్సీ భరత్ పై పోలీసు కేసు! అసలు ఏం చేశాడో తెలుసా? ఇలాంటివాడికి ఏ శిక్ష వేసినా తక్కువే!
48 గంటల్లో అకౌంట్లలోకి డబ్బులు! సీఎం చంద్రబాబు భారీ శుభవార్త! ఇక ఆ పథకాలు కూడా లైన్ లోకి!
వాలంటీర్లకు భారీ శుభవార్త.. కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: