ఏపీలో ఎన్డీయే కూటమి వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయకుండా కొనసాగిస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అంతే కాదు వారి జీతాలు కూడా పెంచుతామన్నారు. ఆ దిశగానే ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తాజాగా దీనిపై సాంఘిక సంక్షేమ శాఖామంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి స్పందించారు. ఏపీలో వాలంటర్ వ్యవస్థను తొలగిస్తామంటూ వస్తున్న ప్రచారాన్ని మంత్రి బాల వీరాంజనేయస్వామి ఖండించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. వాలంటీర్లను వైసీపీ ప్రభుత్వం రాజకీయంగా వాడుకుందన్నారు. వారి భవిష్యత్తును దెబ్బకొంట్టేందుకు ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వం ఏడాది కాలంగా వాలంటీర్ సేవలను రెన్యూవల్ చేయకుండా వారిని మోసం చేశారన్నారు. వైసీపీ ప్రభుత్వం ఒత్తిడి కారణంగా తాము రాజీనామా చేశామని.. కొందరు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని కలిసి తమ ఆవేదనను తెలిపారు. తమను విధుల్లోకి తీసుకోవాలని వేడుకున్నారు. దీనిపై త్వరలోనే నిర్ణయం చెబుతామన్నారు. ఈ వ్యవస్థను రద్దు చేయకుండా దీనిలో కొన్ని మార్పులు, చేర్పులు చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ప్రజల అభిప్రాయాలు, సూచనలు కూడా తీసుకోనుంది. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు రూ.10 వేలు వేతనం ఇస్తామని టీడీపీ కూటమి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఇంకా చదవండి: కేంద్రం గుడ్‌న్యూస్.. ఉచితంగా కుట్టుమిషన్! ఇలా దరఖాస్తు చేసుకోండి! లేట్ అయితే అవకాశం మిస్ అవ్వచ్చు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ మహిళలకు చంద్రన్న వరం.. అదిరే శుభవార్త చెప్పారండోయ్! వారెవ్వా ఏం ఐడియా అండి బాబు!
మందుబాబులకు గుడ్ న్యూస్! భారీగా మద్యం ధరలు తగ్గింపు.. ఎప్పటి నుంచంటే?
రూ.3 లక్షల 50 వేల జీతంతో ఉద్యోగం! మిస్ అవ్వొద్దు, ఈ నెల 3న జాబ్ మేళా! ఆ వివరాలు మీకోసం!
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు! స్పందించిన పవన్ కల్యాణ్! దశాబ్దాల నుంచి కొనసాగతున్న అంశంపై!
పాత ప్రభుత్వం వాలంటీర్లను పట్టించుకోలేదు! అక్రమంగా ఎంత మంది పనిచేస్తున్నారో తెలుసా?
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: