జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలను సూర్య వెలుగులతో నింపాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఈ మేరకు సాంప్రదాయేతర ఇందన వనరుల అభివృద్ధి సంస్థకు ఆదేశాలను జారీ చేశాయి. జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సూర్య శక్తిని వినియోగించి విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి గల అవకాశాలను పరిశీలించి నివేదికను ఇవ్వాల్సిందిగా కోరారు. అలాగే అంచనాలను, ఒక్కొక్క కార్యాలయంలో ఎన్ని కిలో వాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చు అనే విషయాలను కూడా పంపాలని కోరారు. జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి సర్వే, చేసి ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేయడానికి ఇప్పటికే ప్రాథమికంగా అంచనాలు పూర్తయ్యాయి. వీటిని రాష్ట్ర ప్రభుత్వానికి అందచేశారు. ప్రభుత్వం ఏజెన్సీని ఈ భాధ్యతలను అప్పగించనుంది. ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన కింద ప్రజల ఇళ్లకే కాకుండా ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా సూర్య ఫలకాలను ఏర్పాటు చేసి తద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఇలా చేయడం వల్ల విద్యుత్ ఉత్పత్తి పెరగడమే కాకుండా, ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే లక్షలాది రూపాయల విద్యుత్ బిల్లును ఆదా చేయవచ్చు.
ఇంకా చదవండి: ఆ పరిశ్రమలన్నీ ఏపీకి వస్తున్నాయి! శుభవార్త చెప్పిన కేంద్ర మంత్రి!
సూర్య ఫలకాలను ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును ఆయా ప్రభుత్వ కార్యాలయాలు వినియోగించుకోవచ్చును. మిగులు విద్యుత్ ఉంటే, ఏపీ ట్రాన్స్ కో కొనుగోలు చేస్తుంది. ఇందుకుగాను ఏపీ ట్రాన్స్ కో యూనిట్ కు ధరను నిర్ణయించి వినియోగదారులకు చెల్లిస్తుంది. బిల్లు వేసే సమయంలో వినియోగించిన విద్యుత్తు నుండి ఏపీ ట్రాన్స్ కో కు సరపరా అయిన విద్యుత్తును మినహాయించుకుని బిల్లును వేస్తారు. ఇందువల్ల ప్రభుత్వ కార్యాలయాలకు భారీగా విద్యుత్ బిల్లులు ఆదా అయ్యే అవకాశాలు ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో ఎక్కువ ప్రభుత్వ కార్యాలయాలు నూతనంగా నిర్మించిన కలెక్టరేట్లోనూ, మరికొన్ని కార్యాలయాలు పాత కలెక్టరేట్లోనూ ఉన్నాయి. ఇవి కాకుండా జిల్లా పరిషత్, చిత్తూరు మండల పరిషత్, ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం, పశుసంవర్ధక శాఖ కార్యాలయం, నీటిపారుదల శాఖ కార్యాలయం, మున్సిపాలిటీ, ఆర్ టి సి కార్యాలయాలు వాటి సొంత స్థలాల్లో చిత్తూరు పట్టణాల్లో ఉన్నాయి.
ఇంకా చదవండి: దటీజ్ చంద్రబాబు! ఇలాంటి ఐడియాలు ఆయనకే వస్తాయి! వాటిని ఎలా వాడబోతున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతాం! ఇక పండగే పండగ!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
మందుబాబులకు గుడ్ న్యూస్! భారీగా మద్యం ధరలు తగ్గింపు.. ఎప్పటి నుంచంటే?
రూ.3 లక్షల 50 వేల జీతంతో ఉద్యోగం! మిస్ అవ్వొద్దు, ఈ నెల 3న జాబ్ మేళా! ఆ వివరాలు మీకోసం!
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు! స్పందించిన పవన్ కల్యాణ్! దశాబ్దాల నుంచి కొనసాగతున్న అంశంపై!
పాత ప్రభుత్వం వాలంటీర్లను పట్టించుకోలేదు! అక్రమంగా ఎంత మంది పనిచేస్తున్నారో తెలుసా?
వైజాగ్ లో 5 ఎకరాలలో అద్భుతమైన మాల్ నిర్మాణం! నగరానికి మణిపూస కానున్న కట్టడాలు! ప్రభుత్వం తరపు నుండి!
జూబెర్ వీడియోలో మెహరున్నీసా ఆచూకీ! నారా లోకేష్ సహాయంతో సౌదీ అధికారులతో చర్చలు!
కుప్పం వైసీపీ కార్యాలయం మూసివేత! MLA భరత్ కనబడకపోవడం పార్టీకి పెద్ద దెబ్బ!
ఏపీలో మరోసారి ఎన్నికలు! ఆ మూడు జిల్లాల్లో కోడ్ అమలులోకి! పోలింగ్ ఎప్పుడంటే!
ఏపీలో వాలంటీర్లకు శుభవార్త! సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: