కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల వృత్తులు చేసే వారికి ప్రత్యేక పనిముట్లు, యంత్రాలను ఇస్తోంది. ఐతే, వాటిని కేంద్రం ఇవ్వకుండా, మనీ ఇస్తూ, ఆ డబ్బుతో కొనుక్కునేలా చేస్తోంది. కుట్టు మిషన్ కూడా ఇదే టైపు. కేంద్రం ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన (pradhan mantri vishwakarma yojana) అనే పథకాన్ని అమలుచేస్తోంది. ఈ పథకంలో భాగంగా.. కుట్టుమిషన్ కొనుక్కునేందుకు రూ.15,000 పొందవచ్చు. ఈ డబ్బును నేరుగా మీ బ్యాంక్ అకౌంట్‌లో వేస్తుంది. అలాగే ఓ వారం డిజిటల్ ట్రైనింగ్ ఇస్తుంది. ఆ సమయంలో రోజుకు రూ.500 చొప్పున మనీ ఇస్తుంది. కుట్టుమిషన్ కొనుక్కున్న తర్వాత.. కేంద్రం 1 లక్ష రూపాయలు రుణం ఇప్పిస్తుంది. ఈ రుణాన్ని 18 నెలల్లో చెల్లించవచ్చు. రుణం చెల్లించాక మరో 2 లక్షల దాకా రుణం తీసుకోవచ్చు. దాన్ని 30 నెలల్లో చెల్లించాలి. ఇలా కేంద్రం కుట్టుమిషన కొనుక్కునేవారు.. షాపు పెట్టుకునేందుకు ఈ రుణం ఇప్పిస్తోంది. ఈ రుణాలకు వడ్డీ చాలా తక్కువగా ఉంటుంది. అలాగే.. రుణాలకు అప్లై చేసుకునే క్రెడిట్ గ్యారెంటీ ఫీజును కేంద్రమే చెల్లిస్తుంది. మహిళలే కాదు పురుషులు కూడా ఈ పథకం కోసం అప్లై చేసుకోవచ్చు. ఈ పథకం ఎలా పొందాలో తెలుసుకుందాం.
ఇంకా చదవండి: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి ఆయనేనా! ప్రజల్లో పెరిగిపోతున్న ఉత్కంఠ!
ఉచిత కుట్టు మిషన్ పథకానికి అర్హతలు:
ఉచిత కుట్టు యంత్రం పథకం కోసం దరఖాస్తు చేయడానికి, దరఖాస్తుదారు తప్పనిసరిగా భారతదేశ పౌరులు అయి ఉండాలి. ఇప్పటికే కుట్టుపని చేస్తున్న వారు మాత్రమే ఉచిత కుట్టు మిషన్ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కింద టైలర్‌గా పనిచేసే ఎవరైనా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఉచిత కుట్టు యంత్రం పథకం కోసం దరఖాస్తు చేయడానికి, దరఖాస్తుదారు వయస్సు 18 ఏళ్లు పైబడి ఉండాలి.
ఇంకా చదవండి: దటీజ్ చంద్రబాబు! ఇలాంటి ఐడియాలు ఆయనకే వస్తాయి! వాటిని ఎలా వాడబోతున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతాం! ఇక పండగే పండగ!
ఉచిత కుట్టు మిషన్ పథకం కోసం అవసరమైన పత్రాలు:
ఈ పథకం కోసం అప్లై చేసుకునేవారు ఆధార్ కార్డు, చిరునామా రుజువు, గుర్తింపు కార్డు, కుల ధృవీకరణ పత్రం, పాస్‌పోర్టు సైజు ఫొటో, మొబైల్ నంబర్, బ్యాంకు పాస్ బుక్ కలిగివుండాలి. ఉచిత కుట్టు మిషన్ పథకం కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
ముందుగా అధికారిక https://pmvishwakarma.gov.in లోకి వెళ్లాలి. ఇందులో రిజిస్టర్ అవ్వాలి. మీరు ఆన్‌లైన్‌లో కుదరదు అనుకుంటే మీ దగ్గర్లోని మీ సేవా కేంద్రానికి వెళ్లి, చేయించుకోవచ్చు. మీరు పైన చెప్పుకున్న పత్రాలను మీ దగ్గర ఉంచుకోవాలి. మీ దరఖాస్తు అప్లై చేశాక, మీకు రసీదు వస్తుంది. ఆ రసీదును మీ దగ్గర ఉంచుకోవాలి. ఆ తర్వాత కొన్ని రోజులకు కేంద్రం మీ బ్యాంక్ అకౌంట్‌లో మనీ జమ చేస్తుంది. తద్వారా మీరు కుట్టు మిషన్ కొనుక్కోవచ్చు.
ఇంకా చదవండి: ఏపీ మహిళలకు చంద్రన్న వరం.. అదిరే శుభవార్త చెప్పారండోయ్! వారెవ్వా ఏం ఐడియా అండి బాబు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
మందుబాబులకు గుడ్ న్యూస్! భారీగా మద్యం ధరలు తగ్గింపు.. ఎప్పటి నుంచంటే?
రూ.3 లక్షల 50 వేల జీతంతో ఉద్యోగం! మిస్ అవ్వొద్దు, ఈ నెల 3న జాబ్ మేళా! ఆ వివరాలు మీకోసం!
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు! స్పందించిన పవన్ కల్యాణ్! దశాబ్దాల నుంచి కొనసాగతున్న అంశంపై!
పాత ప్రభుత్వం వాలంటీర్లను పట్టించుకోలేదు! అక్రమంగా ఎంత మంది పనిచేస్తున్నారో తెలుసా?
వైజాగ్ లో 5 ఎకరాలలో అద్భుతమైన మాల్ నిర్మాణం! నగరానికి మణిపూస కానున్న కట్టడాలు! ప్రభుత్వం తరపు నుండి!
జూబెర్ వీడియోలో మెహరున్నీసా ఆచూకీ! నారా లోకేష్ సహాయంతో సౌదీ అధికారులతో చర్చలు!
కుప్పం వైసీపీ కార్యాలయం మూసివేత! MLA భరత్ కనబడకపోవడం పార్టీకి పెద్ద దెబ్బ!
ఏపీలో మరోసారి ఎన్నికలు! ఆ మూడు జిల్లాల్లో కోడ్ అమలులోకి! పోలింగ్ ఎప్పుడంటే!
ఏపీలో వాలంటీర్లకు శుభవార్త! సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: