ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నప్పుడు రాష్ట్రం నుంచి చాలా పరిశ్రమలు వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అయితే ఆ పరిశ్రమలన్నీ మళ్లీ వెనక్కి వస్తున్నాయమని తాజాగా కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ తెలిపారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన ఏపీ అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్లలో రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన పరిశ్రమలతో పాటు కొత్త కంపెనీలను ఆహ్వానిస్తున్నామని శ్రీనివాసవర్మ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేయాలని ప్రధాని మోడీ దృష్టిలో ఉందని ఆయన చెప్పారు.
ఇంకా చదవండి: ఏపీ మహిళలకు చంద్రన్న వరం.. అదిరే శుభవార్త చెప్పారండోయ్! వారెవ్వా ఏం ఐడియా అండి బాబు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇందులో భాగంగానే కేంద్ర బడ్జెట్ లో అమరావతికి రూ. 15 వేల కోట్లు కేటాయించారని తెలిపారు. భవిష్యత్తులో ఏపీ కష్టాలన్నీ తీరిపోతాయన్నారు. గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రం చాలా వెనక్కి వెళ్లి పోయిందని, జగన్ అనే గ్రహణం కారణంగా ఆలయాలను సైతం ఎవరూ పట్టించుకోలేదన్నారు. ఇన్ని రోజులకు ఆంధ్రప్రదేశ్ జనాలకు మంచి రోజులు వచ్చాయని కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ తెలిపారు.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
మందుబాబులకు గుడ్ న్యూస్! భారీగా మద్యం ధరలు తగ్గింపు.. ఎప్పటి నుంచంటే?
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: