నేటికీ దేశంలోని కొన్ని ప్రాంతాల్లో స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో లేదు. ఈ సమస్యను అధిగమించేందుకు కేంద్రం కొన్ని ప్రయత్నాలు చేస్తోంది. తద్వారా ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందుతోంది. ఇటీవల కేంద్రం హర్ ఘర్ నల్ యోజనను ప్రారంభించింది. ఈ పథకం ద్వారా దేశంలోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించాలనుకుంటోంది. ఇందుకోసం కేంద్రం ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్‌ను ఇస్తోంది. ఈ పథకం కింద 2024 చివరి నాటికి ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన నీటిని అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. హర్ ఘర్ నల్ యోజనను జల్ జీవన్ మిషన్ అని కూడా అంటారు. ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛమైన నీరు అందుబాటులో ఉంటోంది. ప్రతి వ్యక్తికి రోజుకు 55 లీటర్ల చొప్పున తాగునీరు అందించడం ఈ పథకం లక్ష్యం.
ఇంకా చదవండి: సీఎం చంద్రబాబుకు అర్జీలు ఇచ్చేందుకు మంగళగిరికి పోటెత్తిన ప్రజలు! రాజధాని, అన్న క్యాంటీన్లకు విరాళాలు!
హర్ ఘర్ నల్ యోజనకు నిధులు:
జల్ జీవన్ మిషన్ మొత్తం అంచనా వ్యయం రూ.3.60 లక్షల కోట్లు. హిమాలయ, ఈశాన్య రాష్ట్రాలకు, ఈ పథకం కింద 90% మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. మిగతా 10% రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. ఈ పథకం కింద కేంద్రపాలిత ప్రాంతాలకు 100% అమలు ఖర్చును కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. మిగిలిన రాష్ట్రాలకు, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం 50-50 శాతం ఉంటుంది.
హర్ ఘర్ నల్ పథకానికి అర్హత, కావాల్సిన పత్రాలు:
దరఖాస్తుదారు తప్పనిసరిగా భారతదేశంలో శాశ్వత నివాసి అయి ఉండాలి. కావాల్సిన పత్రాలైతే, ఆధార్ కార్డు, అడ్రెస్ ప్రూఫ్, ఆదాయ ధృవీకరణ పత్రం, వయస్సు రుజువు, ఆదాయ రుజువు, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో ఉండాలి.
హర్ ఘర్ నల్ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి:
ముందుగా మీరు జల్ జీవన్ మిషన్ అధికారిక వెబ్‌సైట్ (https://jaljeevanmission.gov.in/)కి వెళ్లాలి. హోమ్ పేజీలో “అప్లై నౌ” అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో మీ పేరు, మొబైల్ నంబర్, ఇమెయిల్ ID మొదలైన ముఖ్యమైన సమాచారాన్ని ఇవ్వాలి. తర్వాత అడిగిన పత్రాలను అప్‌లోడ్ చెయ్యాలి. తర్వాత సబ్మిట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. మీరు అప్లై చేసుకున్నాక, అధికారులు మిగతా పనిని చూసుకుంటారు. వారే ఇంటికి వచ్చి, ఎలా నల్లా ఏర్పాటు చెయ్యాలో చూసుకుంటారు. ఐతే.. మీరు అధికారిక పోస్టర్ డ్యాష్‌బోర్డులో.. మీ అప్లికేషన్ స్టేటస్ చూసుకోవచ్చు. ఈ సంవత్సరం చివరి నాటికే పేదలందరికీ నల్లాలు ఏర్పాటు చేసేందుకు కేంద్రం రెడీ అవుతోంది. అటు రాష్ట్రాల ప్రభుత్వాలు సైతం ఇదే ఆలోచనలో ఉన్నాయి. ఏపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇంటింటికీ నల్లా ఇస్తామని హామీ ఇచ్చింది. కాబట్టి.. ఈ పథకం ఆ ప్రభుత్వానికి సరైనది. దీన్ని ఉపయోగించుకొని వెంటనే అమలు చేయిస్తే, ఏపీలో నల్లాల సమస్య తీరిపోతుంది.
ఇంకా చదవండి: చంద్రబాబు పండుగ కానుక అదరహో! ఉచితంగా 3 ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు అప్పటి నుంచే? ఈ డాక్యుమెంట్లు రెడీ చేసుకోండి!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
మందుబాబులకు గుడ్ న్యూస్! భారీగా మద్యం ధరలు తగ్గింపు.. ఎప్పటి నుంచంటే?
రూ.3 లక్షల 50 వేల జీతంతో ఉద్యోగం! మిస్ అవ్వొద్దు, ఈ నెల 3న జాబ్ మేళా! ఆ వివరాలు మీకోసం!
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు! స్పందించిన పవన్ కల్యాణ్! దశాబ్దాల నుంచి కొనసాగతున్న అంశంపై!
పాత ప్రభుత్వం వాలంటీర్లను పట్టించుకోలేదు! అక్రమంగా ఎంత మంది పనిచేస్తున్నారో తెలుసా?
వైజాగ్ లో 5 ఎకరాలలో అద్భుతమైన మాల్ నిర్మాణం! నగరానికి మణిపూస కానున్న కట్టడాలు! ప్రభుత్వం తరపు నుండి!
జూబెర్ వీడియోలో మెహరున్నీసా ఆచూకీ! నారా లోకేష్ సహాయంతో సౌదీ అధికారులతో చర్చలు!
కుప్పం వైసీపీ కార్యాలయం మూసివేత! MLA భరత్ కనబడకపోవడం పార్టీకి పెద్ద దెబ్బ!
ఏపీలో మరోసారి ఎన్నికలు! ఆ మూడు జిల్లాల్లో కోడ్ అమలులోకి! పోలింగ్ ఎప్పుడంటే!
ఏపీలో వాలంటీర్లకు శుభవార్త! సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం!
కుప్పంలో వైసీపీకి భారీ షాక్! టిడిపి లోకి 15 మంది ఎంపీటీసీలు, ఐదుగురు కౌన్సిలర్లు!
సాక్షి కథనాలపై సైకో ఆగ్రహం! వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను బయట పెట్టిన వార్తలు!
పిన్నెల్లికి బిగ్ షాక్! బెయిల్ పిటీషన్ కొట్టివేత!
ఏపీకి మరో రూ.75వేల కోట్ల పెట్టుబడి! కంపెనీ పేరు ఇప్పుడే చెప్పను! మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: