చిత్తూరు జిల్లా
పెద్దిరెడ్డి చెరలో 236 ఎకరాలు - ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్న అక్రమాలు
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి.
పెద్దిరెడ్డి ఆయన సతీమణి, కుమారుడి పేరుతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దాదాపు 236 ఎకరాలు ఉన్నాయని తేలింది. ఆయన తమ్ముడు, ఇతర కుటుంబసభ్యులు, అనుచరులు, బినామీల పేర్లతో ఉన్న భూములకు లెక్కలేదు.
వందల కోట్ల రూపాయల విలువైన అసైన్డ్ భూములు ఉన్నట్లు రెవెన్యూ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. వీటితోపాటు బినామీల పేరిట ఉన్న భూ అక్రమాలు బయటకు రాకుండా చేసేందుకే మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో పకడ్బందీ ప్రణాళికతో అగ్ని ప్రమాద కథ నడిపారని తెలుస్తుంది.
ఇంకా చదవండి: ఏ క్షణమైనా బీజేపీలో బీఆర్ఎస్ ను విలీనం చేసే ఛాన్స్! మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
మదనపల్లె సబ్ కలెక్టరేట్లో జులై 21న జరిగిన దస్త్రాల దహనం ఘటన తర్వాత ప్రభుత్వం భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి పేరిట ఉన్న భూముల వివరాలు సేకరిస్తోంది. వెబ్‌ల్యాండ్ రికార్డుల ప్రకారం చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి, కుటుంబసభ్యుల పేరిట వివిధ సర్వే నంబర్లు, సబ్‌డివిజన్‌ల వారీగా ఉన్న భూముల వివరాలు సేకరించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరుతో 41 ఎకరాలు, మిథున్‌రెడ్డి పేరిట 23 ఎకరాలు, పెద్దిరెడ్డి భార్య స్వర్ణలత పేరిట 171 ఎకరాల భూమి ఉంది.
పెద్దిరెడ్డి కుటుంబం ఆధీనంలో వందల ఎకరాలు: పుంగనూరు మండలం రాగానిపల్లె, మేలుపట్ల, భీమగానిపల్లె, చౌడేపల్లె మండలం దిగువపల్లె, పులిచెర్ల మండలం మంగళంపేట, వెంకటదాసరపల్లె, తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు గ్రామాల్లో ఈ భూములు ఉన్నాయి. అర్బన్ ల్యాండ్ సీలింగ్ చట్టం ప్రకారం మెట్ట భూములు 54 ఎకరాలు, మాగాణి 27 ఎకరాలకు మించి ఒక కుటుంబం వద్ద ఉండకూడదు. అయితే పెద్దిరెడ్డి కుటుంబం అజమాయిషీలో వందలాది ఎకరాల భూములు ఉన్నందున ఇవి చట్ట పరిధిలోనికి వస్తుందా? రాదా? అన్న దానిపై చిత్తూరు జిల్లా అధికారులు పరిశీలన చేస్తున్నారు. మరోవైపు పెద్దిరెడ్డి, మిథున్‌రెడ్డి ఎన్నికల అఫిడవిట్లో ఈ వివరాలు వెల్లడించకపోవడాన్ని కూడా తీవ్రంగా పరిగణిస్తున్నారు.
ఇంకా చదవండి: పెద్దిరెడ్డి కుటుంబం సృష్టించిన అక్రమాలు, అరాచకాలు శ్వేత పత్రం లో బట్టబయలు! పశువుల్లా ఆస్తులు మేసేశారు! వీరికి ఏ శిక్ష పడ్డా అది చిన్నదే!
పుంగనూరు మండలం రాగానిపల్లెలో అక్రమంగా క్రమబద్ధీకరించిన 882 ఎకరాల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనుచరుల వాటానే దాదాపు 600 ఎకరాలని అంచనా. ఇందులో అధిక భాగం గత ఐదేళ్లలో ఆయన పరమైనట్లు తెలుస్తోంది. తంబళ్లపల్లె నియోజకవర్గంలో పెద్దిరెడ్డి తమ్ముడు, అనుచరుల పేర్లతో వందల ఎకరాలున్నట్లు సమాచారం. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలోని పారిశ్రామికవాడ వికృతమాల గ్రామంలో పెద్దిరెడ్డి భార్య స్వర్ణలత పేరిట 27.7 ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. ఇందులో 7.6 ఎకరాలు మాత్రమే కొనుగోలు చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. మిగతావన్నీ 2004-07 మధ్య అసైన్డ్ చేసినవే.
వందల కోట్ల విలువైన భూములు: 1990ల నాటికే పెద్దిరెడ్డి కోట్లకు పడగలెత్తగా, ఆయన భార్యకు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ లెక్కన భూములు అసైన్ చేసిందన్నది తేల్చాల్సి ఉంది. తిరుపతి శివారు తిరుచానూరు పరిధిలోనూ ఆయనకు వందల కోట్ల విలువైన భూములు ఉన్నాయి. అసైన్డ్ భూముల యజమానులను బెదిరించి కారుచౌకగా కొట్టేసి, వాటిని ఫ్రీ హోల్డ్ చేసుకున్నట్లు రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మరోవైపు ఇలా మరికొన్ని వందల ఎకరాలు పెద్దిరెడ్డి పరమయ్యాయి. బైరెడ్డిపల్లె మండలంలోని ఇద్దరు నేతలు పలమనేరు, పుంగనూరు, మదనపల్లె నియోజకవర్గాల్లో ఇదేవిధంగా అసైన్డ్ భూములను చేజిక్కించుకున్నారని వైఎస్సార్సీపీ శ్రేణులే అంటున్నాయి. ఈ ఐదేళ్లలో వారు కూడా రూ.వందల కోట్లకు పడగలెత్తారు. ప్రస్తుతం ఇటువంటి నాయక గణమంతా బెంగళూరుకు మకాం మార్చారు.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
633 మంది భారతీయ విద్యార్థులు మృతి! కారణాలు వింటే..! వారి తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటి!
మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసులో కీలక పరిణామం! వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు!
జగన్‌కు బిగ్ షాక్.. టీడీపీలోకి వైసీపీ కీలక నేత? దానికి కారణం అదేనా!
నిరుద్యోగులకు శుభవార్త.! అర్హతలు, దరఖాస్తు చివరి తేదీ ఇదే!
ఏపీ మంత్రికి తప్పిన ప్రమాదం! అసలు ఏం జరిగిందంటే!
11మంది బలం సరిపోలేదా అంటూ - జగన్ వ్యాఖ్యలకు వైఎస్ షర్మిల కౌంటర్! క్రైస్తవులను ఊచకోత గురి చేసినా..
గోదావరిలో యువకుడి గల్లంతు.. 5 లక్షల సాయం ప్రకటించిన సీఎం! వరద ఉధృతి తగ్గేంత వరకు!
రెడ్ బుక్ అంటే చాలు.. వైసీపీ నేతలకు భయం! రాష్ట్రంపై అసత్య ప్రచారం! టీడీపీ ఎంపీ ఫైర్!
పారిస్ ఒలింపిక్స్‌లో అరకు కాఫీ ఘుమఘుమలు! అతిథులను అలరించనున్న మన్యం పంట!
ఆగస్టులో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవలు! ఆ వివరాలు మీకోసం!
ప్రతిపక్ష నేత హోదా పిటిషన్‌పై విచారణ! హైకోర్టు ఏం తీర్పు ఇవ్వనుంది!
జగన్ ఢిల్లీలో స్థిరపడేందుకు షెల్టర్ అవసరం! కూటమిలో చేరడం అనివార్యం- యనమల రామకృష్ణుడు!
అసత్య ప్రచారాలు చేస్తున్న మీడియాపై మండిపడ్డ మంత్రి లోకేష్! ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటాం!
నేను నోరు విప్పితే జగన్ జైలుకే! బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: