ఏపీలో ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఏర్పడిన టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు రాష్ట్రాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అయితే ఏపీలో వలంటీర్లు కొనసాగుతారా? లేదా? అనే సందేహాలకు సీఎం క్లారిటీ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే.. సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించిన పలు అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీపి కబురు చెప్పారు. సాంఘిక సంక్షేమ శాఖపై సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ పై చర్చించారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు, వలంటీర్ల సేవలు మరింత సమర్థంగా వినియోగించుకునేలా ఆలోచనలు చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ నేపథ్యంలో వలంటీర్లకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. సచివాలయాల్లో ఉద్యోగులు, వలంటీర్లందరినీ ప్రభుత్వం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. వీరి ద్వారా ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు ఎలా అందించాలన్న అంశంపై సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఈ మేరకు కసరత్తు చేయాలని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామితో పాటు అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
633 మంది భారతీయ విద్యార్థులు మృతి! కారణాలు వింటే..! వారి తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటి!
మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసులో కీలక పరిణామం! వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు!
జగన్‌కు బిగ్ షాక్.. టీడీపీలోకి వైసీపీ కీలక నేత? దానికి కారణం అదేనా!
నిరుద్యోగులకు శుభవార్త.! అర్హతలు, దరఖాస్తు చివరి తేదీ ఇదే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: