అమరావతి అభివృద్ధిపై దృష్టి సారించిన ఏపీ ప్రభుత్వం తాజాగా మరో కీలక ప్రాజెక్టు ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. నగరానికి తలమానికంగా ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం అంశంపై దృష్టిసారించింది. విజయవాడ తూర్పు బైపాస్‌కి ఎడంగా, కనీసం 20 కిలోమీటర్ల దూరం నుంచి ఐఆర్ఆర్ వెళ్లేలా ఎలైన్‌మెంట్ సిద్ధం చేయనుంది. ఇందుకు సంబంధించి భూసేకరణ విధానంలోనూ మార్పుల దిశగా యోచిస్తోంది. గత టీడీపీ హయాంలో సుమారు 180 కిలోమీటర్ల అమరావతి అవుటర్ రింగ్ రోడ్డుతో పాటు, సుమారు 97.5 కిలోమీటర్ల పొడవైన ఇన్నర్ రింగు రోడ్డు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అమరావతి, విజయవాడ చుట్టూ.. తాడేపల్లి, మంగళగిరిలతో పాటు, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలోని పలు గ్రామాలు ఐఆర్ఆర్ లోపలికి వచ్చేలా ప్లాన్స్ సిద్ధం చేశారు.
ఆ తరువాత ఈ అంశాలకు బ్రేక్ పడింది. భవిష్యత్తులో అమరావతి, విజయవాడ, గుంటూరు నగరాలు, మంగళగిరి, తాడేపల్లి పట్టణాలు కలిసిపోయి మహానగరంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఇక అమరావతి, విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలూ వేగంగా అభివృద్ధి బాటన సాగుతుండటంతో భవిష్యత్తు అవసరాలకు ఐఆర్ఆర్ అవసరమేనని ప్రభుత్వం అంచనాగా ఉంది. ఇక అమరావతి, విజయవాడ నగరాల చుట్టూ 8 వరుసల ప్రధాన రహదారి, నాలుగు వరుసల సర్వీసు రోడ్డుతో ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మించేందుకు మూడు ఎలైన్‌మెంట్లు గతంలో సిద్ధం చేశారు. ఫుట్‌పాత్‌తో పాటు సైకిల్ ట్రాక్‌ను కూడా ప్లాన్ చేశారు. వీటిల్లో రూ. 6,878 కోట్ల అంచనా వ్యయం ఉన్న రెండో ప్రతిపాదనను దాదాపుగా ఖరారు చేశారు. ప్రాజెక్టును ఫేజ్ 1, ఫేజ్ 2గా విభజించి అంచనాలూ రూపొందించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరోసారి ఐఆర్ఆర్‌పై దృష్టి సారించింది.
ఇంకా చదవండి: వైజాగ్ లో 5 ఎకరాలలో అద్భుతమైన మాల్ నిర్మాణం! నగరానికి మణిపూస కానున్న కట్టడాలు! ప్రభుత్వం తరపు నుండి!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
633 మంది భారతీయ విద్యార్థులు మృతి! కారణాలు వింటే..! వారి తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటి!
మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసులో కీలక పరిణామం! వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు!
జగన్‌కు బిగ్ షాక్.. టీడీపీలోకి వైసీపీ కీలక నేత? దానికి కారణం అదేనా!
నిరుద్యోగులకు శుభవార్త.! అర్హతలు, దరఖాస్తు చివరి తేదీ ఇదే!
ఏపీ మంత్రికి తప్పిన ప్రమాదం! అసలు ఏం జరిగిందంటే!
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అమలులో కీలక పరిణామం! సీఏం చంద్రబాబు తుది నిర్ణయం!
11మంది బలం సరిపోలేదా అంటూ - జగన్ వ్యాఖ్యలకు వైఎస్ షర్మిల కౌంటర్! క్రైస్తవులను ఊచకోత గురి చేసినా..
గోదావరిలో యువకుడి గల్లంతు.. 5 లక్షల సాయం ప్రకటించిన సీఎం! వరద ఉధృతి తగ్గేంత వరకు!
రెడ్ బుక్ అంటే చాలు.. వైసీపీ నేతలకు భయం! రాష్ట్రంపై అసత్య ప్రచారం! టీడీపీ ఎంపీ ఫైర్!
పారిస్ ఒలింపిక్స్‌లో అరకు కాఫీ ఘుమఘుమలు! అతిథులను అలరించనున్న మన్యం పంట!
ఆగస్టులో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవలు! ఆ వివరాలు మీకోసం!
ప్రతిపక్ష నేత హోదా పిటిషన్‌పై విచారణ! హైకోర్టు ఏం తీర్పు ఇవ్వనుంది!
జగన్ ఢిల్లీలో స్థిరపడేందుకు షెల్టర్ అవసరం! కూటమిలో చేరడం అనివార్యం- యనమల రామకృష్ణుడు!
అసత్య ప్రచారాలు చేస్తున్న మీడియాపై మండిపడ్డ మంత్రి లోకేష్! ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటాం!
నేను నోరు విప్పితే జగన్ జైలుకే! బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: