ప్రభుత్వ వ్యతిరేకత, ప్రజా ఆగ్రహంతో వైసీపీ కంచుకోటలు కూడా బద్దలైయ్యాయి. వైసీపీ ఘోర ఓటమితో ఆ పార్టీలో గెలిచిన ప్రజా ప్రతినిధులు ఎంతమంది ఉంటారా అనుమానం కలుగుతోంది. ఇప్పటికే మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు వైసీపీకి రాజీనామా చేశారు. విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. నటుడు అలీ సైతం వైసీపీ ఓడిపోవడంతో రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. పార్టీ ఓడిపోవడంతో చాలామంది నాయకులు పార్టీ మారేందుకు చూస్తున్నారని తెలుస్తోంది. ఈక్రమంలోనే మాజీ మంత్రి శిద్దా రాఘవరావు టీడీపీలో చేరడానికి రెడీ అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. 2014 ఎన్నికల్లో దర్శి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించరాయన. 2014లో టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్దిగా పోటీ చేసిన శిద్దా రాఘవరావుకు జనసేన మద్దతు లభించడంతో కాపు సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా లభించాయి. దీంతో ఇక్కడ శిద్దా రాఘవరావు గెలుపుసాధ్యమైంది.
2019 ఎన్నికల్లో అనూహ్యంగా శిద్దా రాఘవరావును టీడీపీ అధిష్టానం ఒంగోలు పార్లమెంట్‌కు ఎంపీ అభ్యర్దిగా పోటీ చేయించింది. ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన శిద్దా రాఘవరావు ఆ తర్వాత అధికారపార్టీ వైసీపీలో చేరారు. ఈ ఎన్నికల్లో దర్శి టికెట్ ఆశించిన ఆయనకు మొండిచేయి ఎదురైంది. జగన్ సూచనతో టికెట్ దక్కకపోయిన ఆయన వైసీపీలో కొనసాగారు. అయితే ఎన్నికల్లో ఓడిపోవడంతో తిరిగి తన సొంత గూటికి చేరుకోవడానికి ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను కూడా పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు పంపారు. జిల్లాకే చెందిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ద్వారా టీడీపీలోకి రావడానికి శిద్ధా రాఘవరావు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. చంద్రబాబుతో మాట్లాడి టీడీపీ చేరికకు మార్గం సుగమం చేయాలని గొట్టిపాటిని కోరినట్టు తెలుస్తోంది. మరి కష్టకాలంలో టీడీపీని వదిలి వైసీపీలో చేరిన శిద్దా రాఘవరావును చంద్రబాబు పార్టీలో చేర్చుకుంటారా లేదా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఇంకా చదవండి: నిరుద్యోగులకు శుభవార్త.! అర్హతలు, దరఖాస్తు చివరి తేదీ ఇదే!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ మంత్రికి తప్పిన ప్రమాదం! అసలు ఏం జరిగిందంటే!
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అమలులో కీలక పరిణామం! సీఏం చంద్రబాబు తుది నిర్ణయం!
11మంది బలం సరిపోలేదా అంటూ - జగన్ వ్యాఖ్యలకు వైఎస్ షర్మిల కౌంటర్! క్రైస్తవులను ఊచకోత గురి చేసినా..
గోదావరిలో యువకుడి గల్లంతు.. 5 లక్షల సాయం ప్రకటించిన సీఎం! వరద ఉధృతి తగ్గేంత వరకు!
రెడ్ బుక్ అంటే చాలు.. వైసీపీ నేతలకు భయం! రాష్ట్రంపై అసత్య ప్రచారం! టీడీపీ ఎంపీ ఫైర్!
పారిస్ ఒలింపిక్స్‌లో అరకు కాఫీ ఘుమఘుమలు! అతిథులను అలరించనున్న మన్యం పంట!
ఆగస్టులో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవలు! ఆ వివరాలు మీకోసం!
ప్రతిపక్ష నేత హోదా పిటిషన్‌పై విచారణ! హైకోర్టు ఏం తీర్పు ఇవ్వనుంది!
జగన్ ఢిల్లీలో స్థిరపడేందుకు షెల్టర్ అవసరం! కూటమిలో చేరడం అనివార్యం- యనమల రామకృష్ణుడు!
అసత్య ప్రచారాలు చేస్తున్న మీడియాపై మండిపడ్డ మంత్రి లోకేష్! ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటాం!
నేను నోరు విప్పితే జగన్ జైలుకే! బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: