మదనపల్లె ఘటనలో ఎంతటి వారున్నా శిక్షార్హులే అని మంత్రి అనగాని సత్యప్రసాద్ మీడియా సమావేశంలో వెల్లడించారు. సమయం వస్తే పెద్దిరెడ్డి అయినా జగన్ అయినా చర్యలు తప్పవు. గతంలో కొందరు ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చిన భూములపై సమీక్షిస్తాం. రూ.కోట్ల విలువైన భూములను లక్షల రూపాయలకే కేటాయిస్తారా? రెవెన్యూ కార్యాలయంలోనే భద్రత లేని పరిస్థితి ఏర్పడింది. రెవెన్యూశాఖ కార్యదర్శి మూడురోజులపాటు మదనపల్లెలోనే ఉన్నారు. మదనపల్లె ఘటనపై అధ్యయనం చేసి సీఎంకు నివేదిక ఇచ్చారు. మదనపల్లెలో జరిగిన అన్యాయాలపై ప్రజలు ఫిర్యాదు చేశారు. ముగ్గురు అధికారులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చాం. అసైన్డ్ భూముల సమస్యలపై కూడా రెవెన్యూశాఖ అధ్యయనం చేస్తోంది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఎన్ని భూములు 22ఏ కింద ఉన్నాయి.. ఎన్ని తొలగించారనేది పరిశీలించాలి. వైసీపీ హయాంలో భారీగా భూపందేరాలు చేశారు. వైసీపీ హయాంపై ప్రైవేటు వ్యక్తులకు భూములు దోచిపెట్టారు. దోచిపెట్టిన భూములు వెనక్కి తీసుకోవడంపై సమీక్ష జరిగింది. భూ సర్వే పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. భూసర్వే ఇబ్బందులను గ్రామసభల్లో పరిష్కరించుకోవాలి. జగన్ పేరిట 77 లక్షల సరిహద్దు రాళ్లు ఏర్పాటు చేశారు. సరిహద్దు రాళ్లు తొలగించేందుకు రూ.15 కోట్లు ఖర్చవుతుంది. క్యూఆర్ కోడ్‍తో కొత్త పాసు పుస్తకాల తయారీ జరుగుతోంది అని మంత్రి వెల్లడించారు.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
అమెరికాలో దేశబహిష్కరణ ముప్పు.. ప్రమాదంలో లక్షలాది భారతీయులు! ఆలోపు గ్రీన్ కార్డు దక్కితే చట్టబద్ధంగా..
ఏపీ మంత్రికి తప్పిన ప్రమాదం! అసలు ఏం జరిగిందంటే!
11మంది బలం సరిపోలేదా అంటూ - జగన్ వ్యాఖ్యలకు వైఎస్ షర్మిల కౌంటర్! క్రైస్తవులను ఊచకోత గురి చేసినా..
రెడ్ బుక్ అంటే చాలు.. వైసీపీ నేతలకు భయం! రాష్ట్రంపై అసత్య ప్రచారం! టీడీపీ ఎంపీ ఫైర్!
ఆగస్టులో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవలు! ఆ వివరాలు మీకోసం!
నేను నోరు విప్పితే జగన్ జైలుకే! బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: