ఏపీలో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని చవిచూసింది. కేవలం 11 స్థానాలకే పరిమితం కావడంతో వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఈ క్రమంలో పార్టీ నేతల్లో అసహనం నెలకొంది. ఈ నేపథ్యంలో గుంటూరులో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, గుంటూరు నగర అధ్యక్ష పదవికి మాజీ ఎమ్మెల్యే మద్దాలి గిరి రాజీనామా చేశారు. ఈ మేరకు వైసీపీ అధినేత జగన్కు రాజీనామా లేఖ పంపారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. కాగా 2019లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన ముద్దాలి గిరి ఆ తర్వాత వైసీపీలో చేరారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఆయనకు టికెట్ కేటాయించలేదు. దీంతో ఆయన వైసీపీ పట్ల విముఖతతో ఉన్నారనే వార్తలు వినిపించాయి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు! వాతావరణ శాఖ అలర్ట్!
అసెంబ్లీలో మంత్రి లోకేష్ తో ఆ పార్టీ ఎమ్మెల్యేల భేటీ! కారణం ఏంటంటే!
ఐదేళ్లు ఏం చేశారు? మాజీ సీఎం జగన్ కు వైఎస్ షర్మిల స్ట్రాంగ్ కౌంటర్!
నల్ల కండువాతో అసెంబ్లీ కి వచ్చిన జగన్! సభ నుంచి వైసీపీ వాక్ ఔట్!
గత ప్రభుత్వం చేసిన తప్పులపై గవర్నర్ ప్రసంగం! వైసీపీ ఎమ్మెల్యేల ఆందోళన!
వైసీపీకి షాక్! వైఎస్ జగన్ సమావేశానికి ఐదుగురు ఎంపీలు డుమ్మా!
పరామర్శకు వెళ్లి పథకాల గురించి మాట్లాడతారా? హోం మంత్రి తీవ్ర ఆగ్రహం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: