వైసీపీ అధినేత జగన్పై హోం మంత్రి అనిత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వైఎస్ జగన్ హయాంలో రాష్ట్రంలో ఎన్ని హత్యలు, అత్యాచారాలు జరిగాయో గుర్తు చేసుకోవాలన్నారు. పోలీసులను ప్రజల రక్షణకు కాకుండా తన రక్షణకు జగన్ వినియోగించుకున్నారని ఆరోపించారు. బుధవారం అర్ధరాత్రి దారుణంగా హత్యకు గురైన వైసీపీ కార్యకర్త రషీద్ కుటుంబానికి జగన్ ఎంత పరిహారం ఇచ్చారని హోం మంత్రి అనిత ప్రశ్నించారు. వైఎస్ జగన్ రషీద్ కుటంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన సంగతి తెలిసిందే.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
పరామర్శకు వెళ్లి పథకాల గురించి మాట్లాడటం ఏంటని మంత్రి ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై బురద చల్లడానికి వైఎస్ జగన్ ఇష్టారీతిన ఆరోపణలు చేస్తున్నారని మంత్రి అనిత విమర్శలు గుప్పించారు. నాలుగు రాజకీయ హత్యలు జరిగాయి. వీటిలో ముగ్గురు టీడీపీ కార్యకర్తలు చనిపోయారు. 36 రాజకీయ హత్యలు జరిగినట్లు జగన్ ఆరోపించారు. వైఎస్ జగన్ చేస్తున్న ఆరోపణలపై వారి వద్ద వివరాలు ఉంటే నాకు సమాచారం ఇవ్వాలని ఆమె అన్నారు. లేకపోతే మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదని ఫైరయ్యారు. ఇంకా ప్రజలు మీ మాటలు నమ్ముతారని భావిస్తున్నారా? అని హోం మంత్రి అనిత ప్రశ్నించారు.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
పెన్షన్ ల పంపిణీ పై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు! ప్రతి నెలా ఆ తేదీన!
సౌదీలో మరో తెలుగు వ్యక్తి అనుభవిస్తున్న నరకం! స్పందించిన మంత్రి లోకేష్!
రొట్టెల పండుగ నేపథ్యంలో భక్తులకు శుభవార్త! రూ.5 కోట్లు మంజూరు చేసిన సీఎం!
రాత్రి పడుకునే ముందు ఈ పనిచేస్తే ఆరోగ్యమస్తు! అరే చిన్న చిట్కా చేస్తే పోలా!
సినీనటి పై పోలీసు కేసు! అసలు ఆమె ఏమి చేసిందంటే?
శవ రాజకీయాలు చేయడం జగన్ పద్ధతి! 151 నుంచి 11 స్థానాలకు పడిపోయిన సైకో!
ఒమన్: భారత ఎంబసీ నిద్రపోతుందా? పార్కుల్లో, బీచుల్లో నివాసం ఉంటున్న తెలుగు ఆడవాళ్లను పట్టించుకోదా...
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: