పౌరులందరూ ఆధార్ కార్డులు కలిగి ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఆధార్ నమోదు కోసం ప్రత్యేక శిబిరాలుు నిర్పహిస్తూ.. ప్రతి భారతీయ పౌరుడు ఆధార్ కార్డు కలిగి ఉండేలా చర్యలు చేపడుతోంది. అయితే ఏపీ ప్రభుత్వం ఆధార్ కార్డు లేనివారి కోసం కీలక ప్రకటన చేసింది. ఆధార్ కార్డు కోసం ఆధార్ కేంద్రాల వద్ద గంటల తరబడి క్యూలైన్లలో నిల్చోవాల్సిన అవసరం లేకుండా కీలక నిర్ణయం తిసుకుంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జులై 23 నుంచి జులై 27 వరకూ ఏపీ ప్రభుత్వం ఆధార్ నమోదు కోసం ప్రత్యేక శిబిరాలు నిర్వహించనుంది. ఆధార్ నమోదు, అప్ డేట్ చేసుకోవడం కోసం జులై 23 నుంచి నాలుగు రోజుల పాటు ఏపీవ్యాప్తంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నారు. అవసరమైతే పాఠశాలలు, కాలేజీలు, అంగన్వాడీ కేంద్రాల్లోనూ ప్రత్యేక శిబిరాలను నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఐదేళ్లలోపు చిన్నారులకు బాల ఆధార్ కార్డు దరఖాస్తు చేయడం సహా.. ఈ శిబిరాల్లో ఆధార్ అప్ డేట్ కూడా చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. అడ్రస్ మార్పు, పేర్లలో తప్పులు మార్పు వంటి అప్ డేట్స్ ఉంటే సంబంధిత పత్రాలు అందజేసి ప్రత్యేక శిబిరాల్లో ఆధార్ కార్డును అప్ డేట్ చేసుకోవచ్చని ప్రభుత్వ అధికారులు తెలిపారు.
మరోవైపు ఐదేళ్లలోపు వారికి కొత్త ఆధార్ కార్డు నమోదుతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 1.36 కోట్ల మంది డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాల్సి ఉందని అధికారులు తెలిపారు. ప్రత్యేక శిబిరాల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. మనదేశంలో ఐదేళ్లలోపు చిన్నారులకు బాల ఆధార్ కార్డు మంజూరు చేస్తారు. అయితే కనీసం పదేళ్లకు ఓసారి అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. గుర్తింపు కార్డు, చిరునామా ధ్రువీకరణ పత్రాలు సమర్పించి అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుందని ఉడాయ్ చెబుతోంది. ఇలా అప్ డేట్ చేసుకోవడం వలన పౌరుల తాజా సమాచారం కేంద్ర గుర్తింపు సమాచార నిధి వద్ద ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ ఉంటుందని పేర్కొంటోంది. ఈ క్రమంలోనే ఆధార్ అప్డే్ట్ కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తోంది. ప్రత్యేక శిబిరాల్లో ఉచితంగా కొన్ని సేవలను పొందే వీలుంది. మరోవైపు ప్రభుత్వ పథకాలకు కూడా ఆధార్ కార్డు అప్ డేట్ అవసరం. ఈ నేపథ్యంలో పౌరులు ఈ ప్రత్యేక శిబిరాలను ఉపయోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో నాలుగు రోజుల పాటు ఈ డ్రైవ్ కొనసాగుతుందని చెప్పారు.
ఇంకా చదవండి: మాజీ సీఎం జగన్ కాన్వాయ్ కు బ్రేక్ వేసిన పోలీసులు! వారికి నో ఎంట్రీ!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
సినీనటి పై పోలీసు కేసు! అసలు ఆమె ఏమి చేసిందంటే?
శవ రాజకీయాలు చేయడం జగన్ పద్ధతి! 151 నుంచి 11 స్థానాలకు పడిపోయిన సైకో!
ఒమన్: భారత ఎంబసీ నిద్రపోతుందా? పార్కుల్లో, బీచుల్లో నివాసం ఉంటున్న తెలుగు ఆడవాళ్లను పట్టించుకోదా...
సౌదీలో మరో తెలుగు వ్యక్తి అనుభవిస్తున్న నరకం! స్పందించిన మంత్రి లోకేష్!
రొట్టెల పండుగ నేపథ్యంలో భక్తులకు శుభవార్త! రూ.5 కోట్లు మంజూరు చేసిన సీఎం!
రాత్రి పడుకునే ముందు ఈ పనిచేస్తే ఆరోగ్యమస్తు! అరే చిన్న చిట్కా చేస్తే పోలా!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: