రాష్ట్రంలో ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు రాష్ట్రాభివృద్ధిపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఇప్పటికే సీఎం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేశారు. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని చవిచూసిన సంగతి తెలిసిందే. కేవలం 11 స్థానాలకే పరిమితం కావడంతో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఈ క్రమంలో తాజాగా టీడీపీ నేత వైసీపీ పాలనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి ఆ 11 సీట్లు కూడా ఎందుకిచ్చామని ప్రజలు ఆలోచనలో పడ్డారని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. పేర్ని నానికి శ్వేత పత్రం అంటే ఏంటో తెలుసా అని ఎద్దేవా చేశారు. గత ఐదేళ్లలో వైసీపీ పరిపాలన ఎలా చేశారో ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత తమపై ఉంది కాబట్టే సీఎం చంద్రబాబు శ్వేతపత్రాలను విడుదల చేస్తున్నారన్నారు. శ్వేతపత్రాల విడుదలతో వైసీపీ వాళ్ల దొంగతనాలు ఎక్కడ బయటపడతాయోనని భయపడిపోతున్నారని విమర్శించారు.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
శ్రీశైలంలో మరోసారి చిరుత సంచారం! భయాందోళనలో స్థానికులు!
చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత! మాజీ ఎంపీ ఇంటిపై రాళ్ళదాడి!
లోకేశ్ చొరవతో కువైట్ నుంచి ఏపీకి చేరుకున్న శివ! ఆదుకోకపోతే చావే దిక్కు అంటూ కన్నీటితో..
కొడాలి షాక్.. కోర్టును ఆశ్రయించిన పాఠశాల యాజమాన్యం! ఇక జైలుకేనా?
బాలిక అదృశ్యం ఘటనలో చర్యలు.. ఇద్దరు పోలీసులపై సస్పెన్షన్ వేటు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: