ఏపీలో ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన అన్ని స్థానంలో విజయ ప్రభంజనం సృష్టించింది. ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. జనసేన వంద శాతం స్ట్రయిక్ విజయం సాధించి దేశ రాజకీయాల్లో చర్చించుకునే విధంగా చేసింది. ఆ సమయంలో ఎక్కడ చూసినా, ఏ నోట విన్న జనసేన గెలుపు పై హోరాహోరీగా చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలో జనసేన గెలుపు దేశంలోనే ఒక కేస్ స్టడీ అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు, జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖేష్ అంబానీ కుమారుడి వివాహ వేడుకకు అటెండ్ అయ్యారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ మాట్లాడుతూ.. అనంత్ అంబానీ పెళ్లికి వెళితే అందరూ జనసేన గెలుపు గురించే మాట్లాడారని తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయానికి జనసేన తీసుకున్న నిర్ణయమే కారణమన్నారు. జనసేన ప్రజాప్రతినిధుల సత్కార కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో తాను డిప్యూటీ సీఎం అవుతానని అనుకోలేదని చెప్పారు. ప్రధాని మోడీ మనసులో తనకు ప్రత్యేక స్థానం ఉందని డిప్యూటీ సీఎం పవన్ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
తస్మాత్ జాగ్రత్త! చంద్రబాబు పీఎస్ అంటూ ఫోన్! నమ్మి దొరికిపోతే మీ అకౌంటులు ఖాళీ!
మదన్ మోహన్ వేధింపులు, సుభాష్ పరిచయం! అసిస్టెంట్ కమిషనర్ శాంతి కథనం! అసలు కథలోకి వెళితే!
అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టనున్న జగన్ రెడ్డి! కారణం ఆదేనా!
టిడ్కో ఇళ్ల పంపిణీకి ముహూర్తం ఫిక్స్! ఎమ్మెల్యే బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు!
ఏపీలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్! నేడు, రేపు భారీ వర్షాలు!
మహారాష్ట్ర సీఎం తో చంద్రబాబు భేటీ! కీలక అంశాలపై చర్చ!
ఏపీలో ఒకేసారి 37 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ! ఆ వివరాలు మీకోసం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: