తల్లికి వందన పథకం పై గత కొన్ని రోజులుగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కాగా వైసీపీ పార్టీ కావాలనే దుష్ప్రచారం చేస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు ఆ పార్టీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాము ఇంకా తల్లికి వందనం పథకాన్ని అమల్లోకి తీసుకురాలేదని.. ఆ పథకంపై విధివిధానాలు రూపొందుతున్నాయని.. ఆ పథకం అమలు కాకముందే.. వైసీపీ పార్టీ దుష్ప్రచారం చేస్తోందని తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నెల రోజులుగా వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తుందని.. వాటిని ఏపీ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. తమ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి రూ.15 వేలు ఇస్తామని మంత్రి చెప్పుకొచ్చారు. కాగా కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో అమ్మకు వందనం పథకం కింద ఒక ఇంట్లో ఎంత మంది విద్యార్థులు ఉన్నా.. కేవలం రూ. 15 వేలు మాత్రమే ప్రభుత్వం ఇవ్వనుందని పలువురు ప్రచారం చేస్తున్న క్రమంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇవి కూడా చదవండి:
బీజేపీలో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం! క్లారిటీ ఇచ్చిన గులాబీ పార్టీ!
టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ తో కాంట్రవర్సీ! లావణ్య సంచలన నిర్ణయం!
నవయుగ ధర్మరాజు చంద్రబాబు! రాష్ట్ర ప్రగతి ఆయతోనే సాధ్యం! అక్షయపాత్ర అంతర్జాతీయ అధ్యక్షుడు వ్యాఖ్యలు!
రెండేళ్లుగా ఉన్న సమస్యను 24 గంటల్లో పరిష్కరించిన మంత్రి లోకేష్! ఇది కదా ప్రజాస్వామ్యం అంటే!
నాకు ఆయనే ప్రాణభిక్ష పెట్టారు! సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!
రాజధాని నిర్మాణంపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! ఆ సంస్థలకు బాధ్యతలు!
ఏపీ లో అధ్వాన్నంగా ఉన్న రోడ్డులపై సీఎం చంద్రబాబు దృష్టి! అధికారులకు కీలక ఆదేశాలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: