వైసీపీ నేతలపై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. పేర్ని నాని, అమర్‌నాథ్ మతిభ్రమించినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. అభివృద్ధి ఆంధ్రప్రదేశ్‌గా చంద్రబాబు మారిస్తే.. అప్పుల రాష్ట్రంగా జగన్ మార్చారని ధ్వజమెత్తారు. ఆరడుగుల నిజాయితీకి నిదర్శనం చంద్రబాబు అని అన్నారు. ఐదు అడుగుల తాచుపాము జగన్ అంటూ ఎద్దేవా చేశారు. ఈ తాచుపాముకు తన మన బేధం లేదని.. ఎవరినైనా కాటేస్తాడని విమర్శించారు. తప్పుడు కేసులతో చంద్రబాబును జగన్ జైలుకు పంపించారని బుద్ధా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ అప్పుడు యావత్ దేశంతో పాటు విదేశాల్లో స్థిరపడిన వారు కూడా బాబుకు మద్దతుగా నిలిచారని గుర్తుచేశారు. వైసీపీ చేసిన పిచ్చి పనులకు ప్రజలు వారిని తరిమికొట్టారని అన్నారు.
ఇంకా చదవండి: మీ ఇళ్లను కూడా ఇలాగే నిర్మిస్తారా? అధికారులపై మంత్రి నిమ్మల ఫైర్! ప్రభుత్వం మారిందని, పనులు నాణ్యతగా!
ఇంకా అబద్ధాలతో ప్రజలను మాయ చేయాలని అనుకుంటున్నారని మండిపడ్డారు. వైసీపీలో జగన్ నుంచి కిందిస్థాయి వరకు అందరూ కూడా పదవీ కాంక్షతో బతుకుతున్నారని బుద్ధా వెంకన్న విమర్శించారు. జగన్‌ను చూసి పారిశ్రామికవేత్తలు భయంతో వెళ్లిపోయారని తెలిపారు. సంయమనం పాటించాలని తమకు చంద్రబాబు తెలిపారని అన్నారు. ఇంకోసారి అబద్ధాలు ప్రచారం చేస్తే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. చంద్రబాబు హామీ ఇచ్చిన విధంగా సూపర్ సిక్స్‌లను అమలు చేస్తారని తెలిపారు. నెల రోజుల్లోనే అన్నీ అయిపోవడం సాధ్యమేనా అని ప్రశ్నించారు. మీ జగన్ అధికారంలోకి వచ్చినప్పుడు మొదటి నెలలో పదవులు పంచుకునే పనిలో బిజీగా ఉన్నాడని చెప్పారు. అదే చంద్రబాబు మాత్రం ఢిల్లీకి వెళ్లి నిధుల కోసం కృషి చేస్తున్నారని చెప్పారు. మీరు చేసిన అప్పులు, తప్పులు సరిచేయడానికి చంద్రబాబు కష్టపడుతున్నారని వైసీపీ నాయకులను ఉద్దేశించి అన్నారు. చంద్రబాబు సంపద సృష్టిస్తారని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని తెలిపారు.
ఇంకా చదవండి: రాజధాని నిర్మాణంపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! ఆ సంస్థలకు బాధ్యతలు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ ఐఏఎస్ బదిలీలపై కీలకమైన మార్పులు ! 19 మంది కొత్త పాత్రల్లో !
ఒకేరోజు నాలుగు ఎత్తిపోతల పథకాలు ప్రారంభం ! కృష్ణమ్మకు పూజలు, నీటి ప్రవాహం!
ఊహించని మలుపు తిరిగిన రాజ్‌తరుణ్ వివాదం! బాంబు పేల్చిన మాల్వీ!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: