ఏపీ ఆర్థిక, ప్రణాళిక, శాసనసభ వ్యవహారాల మంత్రిగా పయ్యావుల కేశవ్ ఈరోజు బాధ్యతలను స్వీకరించారు. సెక్రటేరియట్ లోని రెండో బ్లాక్ లో ఉన్న తన ఛాంబర్ లోకి ప్రవేశించి, వేద పండితుల ఆశీర్వచనాల మధ్య బాధ్యతలు చేపట్టారు. ఆర్థిక మంత్రిగా తన తొలి సంతకాన్ని 15వ ఆర్థిక సంఘం నిధుల ఫైల్ పై చేశారు. రూ. 250 కోట్ల ఆర్థిక సంఘం నిధులను స్థానిక సంస్థలకు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శులు కేవీవీ సత్యనారాయణ, జానకి, వినయ్ చంద్, స్టేట్ ట్యాక్సెస్ చీఫ్ కమిషనర్ గిరిజా శంకర్, ఆర్థిక శాఖ స్పెషల్ సెక్రటరీ కె.ఆదినారాయణ, ట్రెజరీస్ డైరెక్టర్ మోహన్ రావుతో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మంత్రిగా బాధ్యతలను స్వీకరించిన సందర్భంగా పయ్యావుల మాట్లాడుతూ... రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం తన ప్రధాన బాధ్యత అని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వ అసమర్థత కారణంగా 16 పథకాలను కేంద్ర ప్రభుత్వం ఆపేసిందని... ఆ పథకాలన్నీ 60 శాతం రాష్ట్రం, 40 శాతం కేంద్ర ప్రభుత్వం నిధులు పెట్టేవని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిధులను కూడా వాడుకోలేని దారుణ స్థితి వైసీపీ హయాంలో ఉందని విమర్శించారు. జగన్ కు ఎవరు సలహాలు ఇచ్చారో కూడా తెలియడం లేదని అన్నారు. వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ గాడి తప్పాయని వ్యాఖ్యానించారు.

ఇంకా చదవండి: ఎవరికైనా కష్టమే.. విశాఖ స్టీల్ ప్లాంట్పై కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ కీలక వ్యాఖ్యలు! ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా..

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

భారత్-రష్యా సంబంధాలు మరింత పటిష్టం! అమెరికాను వ్యూహాత్మకంగా దారిలోకి తెచ్చుకుంటున్న మోడీ! భారత్ ప్రతిష్ట మరింత పైకి!

ఆర్ధిక శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష! రాష్ట్రం మొత్తాన్ని నాకించేశారు! అంచనాలకు అందని జగన్ దోపిడీ!

ఛీ ఛీ.. విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికురాలిపై లైంగికదాడికి యత్నం! కిందపడిన బాధితురాలు!

ఒకేరోజు నాలుగు ఎత్తిపోతల పథకాలు ప్రారంభం ! కృష్ణమ్మకు పూజలు, నీటి ప్రవాహం!

46 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న పూరీ జగన్నాథుడి భాండాగారం! ఏకగ్రీవంగా తీర్మానించిన 16 మంది సభ్యుల కమిటీ!

ఊహించని మలుపు తిరిగిన రాజ్‌తరుణ్ వివాదం! బాంబు పేల్చిన మాల్వీ!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group