రాష్ట్రంలో ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో నాలుగోసారి ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టారు. ఏపీలో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో ఘన విజయం సాధించింది. జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలుపొందారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవితో పాటు పలు కీలక శాఖల బాధ్యతలు అప్పగించారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఈ ఎన్నికల్లో అన్ని సీట్లను గెలిచి ఏపీలో వంద శాతం స్టయిక్ సాధించిన జనసేనకి కేవలం మూడు మంత్రి పదవులు మాత్రమే దక్కాయి. దీంతో జనసేన కేడర్ లో అసంతృప్తి నెలకొంది. ఈ అసంతృప్తి పై పార్టీ అధినేతకు సమాచారం అందింది. ఈ క్రమంలో జనశ్రేణులను మరింత ఉత్సాహపరిచే విధంగా సీఎం చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంలో అత్యంత కీలకమైన అదనపు అడ్వకేట్ జనరల్ (AAG) పదవిని కూడా జనసేన పార్టీకి కేటాయించారు. ఇటీవల అడ్వకేట్ జనరల్ గా దమ్మాలపాటి శ్రీనివాసకు అవకాశం వచ్చింది. రెండో కీలక స్థానమైన AAG పదవిని జనసేనకు ఇచ్చారు. జనసేన లీగల్ వ్యవహారాల సలహాదారు సాంబశివ ప్రతాప్ కు ఈ పదవి దక్కింది.
ఇవి కూడా చదవండి:
యూఏఈ: సంచలన నిర్ణయం! 43 మంది పౌరులకు జీవిత ఖైదు! అండగా ఐక్యరాజ్యసమితి!
ఏపీ పోలిటిక్స్ లో ఆసక్తికర పరిణామం! వల్లభనేని వంశీపై కేసు నమోదు! అరెస్టుకు రంగం సిద్ధం!
ఆ విషయంలో కేటీఆర్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన RRR! ఓడిపోయి మిత్ర ధర్మాన్ని పాటించారు!
ఆర్ధిక శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష! రాష్ట్రం మొత్తాన్ని నాకించేశారు! అంచనాలకు అందని జగన్ దోపిడీ!
'పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా' నెంబర్ ప్లేట్ తొలగించి... స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన పోలీసులు!
పోలీసు కస్టడీలో పిన్నెల్లి రెండవరోజు విచారణ! ఏం చెప్పాడో తెలుసా!
ట్విటర్ లో ఎంపీ సత్యకుమార్ మాస్ రాగింగ్! ఏకంగా బ్లాక్ చేసిన కేటీఆర్!
అజ్ఞాతంలోకి నేతలు... అయోమయంలో కార్యకర్తలు! ఇలా ఉంది వైసీపీ పరిస్థితి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: