అమరావతి: టీటీడీ మాజీ అదనపు ఈవో ధర్మారెడ్డి, సమాచార పౌర సంబంధాల శాఖ మాజీ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డిపై విజిలెన్స్ విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ధర్మారెడ్డి, విజయ్ కుమార్ రెడ్డిల పదవీ కాలంలో భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ప్రభుత్వానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ధర్మారెడ్డి, విజయ్ కుమార్ రెడ్డిపై టీడీపీ నేతలు, జర్నలిస్ట్ సంఘాలు ఫిర్యాదు చేశారు. ఇటీవలే ధర్మారెడ్డి ఉద్యోగ విరమణ చేసిన విషయం తెలిసిందే. అయితే కేంద్రంలో చేరేందుకు ఢిల్లీకి వెళ్లి తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి వెనక్కు వచ్చారు.
ఇంకా చదవండి: ఆసక్తికరంగా ఛైర్మన్ పోస్టు! రేసులోకి మరో కొత్త పేరు! శ్రీవారి ఆశీర్వాదం ఎవరికి..?
దర్యాప్తులో భాగంగా వీరిద్దరి అవినీతికి సహకరించిన ఇతర ఉద్యోగులనూ విచారణ పరిధిలోకి తేవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. శ్రీవాణి టికెట్లలో అక్రమాలకు పాల్పడ్డారని టీటీడీని అడ్డం పెట్టుకుని వైసీపీకి విరాళాలు సేకరించారని, బడ్జెట్‌తో సంబంధం లేకుండా సివిల్ కాంట్రాక్ట్ పనులు ఇచ్చారని ధర్మారెడ్డిపై అభియోగాలు ఉన్నాయి. సమాచార శాఖలో నిబంధనలకు విరుద్ధంగా ప్రకటనల పేరిట కోట్ల రూపాయల మేర అవినీతికి పాల్పడ్డారని విజయ్ కుమార్ రెడ్డిపై కూడా ఆరోపణలు వచ్చాయి. పూర్తి స్థాయిలో అన్ని కోణాల్లో విజిలెన్స్ విచారణ చేపట్టాలని ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఇంకా చదవండి: అమరావతి వాసులకు అదిరిపోయే గుడ్ న్యూస్! ఆ ప్రాజెక్టుకు కేంద్రం నిధులు కేటాయింపు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఆర్ధిక శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష! రాష్ట్రం మొత్తాన్ని నాకించేశారు! అంచనాలకు అందని జగన్ దోపిడీ!
ఛీ ఛీ.. విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికురాలిపై లైంగికదాడికి యత్నం! కిందపడిన బాధితురాలు!
ఒకేరోజు నాలుగు ఎత్తిపోతల పథకాలు ప్రారంభం ! కృష్ణమ్మకు పూజలు, నీటి ప్రవాహం!
ఊహించని మలుపు తిరిగిన రాజ్‌తరుణ్ వివాదం! బాంబు పేల్చిన మాల్వీ!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: