ఇటీవల ఏపీలో ఎమ్మెల్యేల కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు టీడీపీ నుంచి సి.రామచంద్రయ్య, జనసేన నుంచి హరిప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, హరిప్రసాద్ నేడు అసెంబ్లీలో రిటర్నింగ్ అధికారి నుంచి ధ్రువీకరణ పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా హరిప్రసాద్ మాట్లాడుతూ, జనసేనాని పవన్ కల్యాణ్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు. రాష్ట్రాభివృద్ధి, ప్రజాసంక్షేమం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని వెల్లడించారు. "శాసనమండలి సభ్యుడిగా ఎన్నికవడం ఎంతో సంతోషం కలిగిస్తోంది. ఎమ్మెల్సీ పదవిని బాధ్యతాయుతమైన పదవిగా భావిస్తున్నాను. నాపై నమ్మకం ఉంచి ఎమ్మెల్సీ బాధ్యతలు అప్పగించిన డిప్యూటీ సీఎం, మా పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్, సీఎం చంద్రబాబు, టీడీపీ, జనసేన నేతలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. శాసనమండలి తొలి సమావేశాలు ప్రారంభం అయ్యేందుకు కొంత సమయం ఉంది. కౌన్సిల్ సమావేశాలు, ప్రశ్నోత్తరాలు, చర్చ, భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్లాలి? అనే అంశాలపై అధ్యయనం చేయడానికి నాకు ఈ సమయం ఉపయోగపడుతుంది" అని హరిప్రసాద్ పేర్కొన్నారు.
ఇంకా చదవండి: చార్ ధామ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత! వాతావరణ శాఖ హెచ్చరికలు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీపై ఆగ్రహంగా బంగాళాఖాతం? భారీ నుంచి అతి భారీ వర్షాలు! వాతావరణ కేంద్రం అలర్ట్!
ఆస్ట్రేలియా స్టూడెంట్ వీసా ఛార్జీల పెంపు! ఉన్నత విద్య కోసం వెళ్ళే విద్యార్థులకు భారీ షాక్!
ఆ రోజు భూమికి అతి దగ్గరగా రానున్న ఆస్టరాయిడ్! నాసా ఏం చెప్తుంది అంటే!
మంత్రులతో కలిసి రేపు విజయవాడకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి! ఎందుకో తెలుసా?
మీకు ఇది తెలిస్తే ఆశ్చర్యపోతారు! 30 ఏళ్లుగా ఒక్క చీర కూడా కొనని సుధామూర్తి!
అమెరికాలో కాల్పుల మోత! ఇంటి యజమాని సహా నలుగురి మృతి! కాల్చింది ఎవరో కాదు సొంత కొడుకే! కారణం?
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: