ఇలా అధికారం పోయిందో లేదో అలా నేతలు ఒక్కొక్కరుగా జారిపోతున్నారు. వైసీపీ కార్యనిర్వాహక రాజధానిగా అదే పనిగా ప్రచారం చేసిన విశాఖలో పార్టీ మునుగడే కష్టంగా మారింది. ఐదేళ్ల పాటు విజయసాయిరెడ్డి వీరవిహారంతో అసలే 30 శాతానికి పడిపోయిన ఓటింగ్ తో దారుణ పరిస్థితులు ఎదుర్కొంటున్న వైసీపీని ఇప్పుడు నడిపించే నాయకుడే కనిపించడం లేదు. మాజీ ప్రజా ప్రతినిధులు, విశాఖ లోని వివిధ నియోజక వర్గాల నుంచి పోటీ చేసి ఓడిపోయిన నేతలు పార్టీకి మొహం చాటేస్తున్నారు. అంతే కాదు పార్టీ మారే ప్రయత్నాలు చేస్తుండడం ఇప్పుడు పార్టీ కార్యకర్తలను కలవర పెడుతోంది. విశాఖ మాజీ ఎంపీ, విశాఖ తూర్పు వైసీపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ పోలీసు కేసుల నేపథ్యంలో పరారయ్యారు. హైకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్లో ఉపశమనం రాకపోవడంతో ఆ తరువాత ముందస్తు బెయిల్ పొందారు. అయితే, విశాఖ వస్తే మరో కేసులో అరెస్టు చేయవచ్చన్న భయం ఆయనను వెంటాడుతోంది.
ఇంకా చదవండి: జగన్.. ఏపీ అంటే నీకు ఎందుకంత ద్వేషం? మా ఏపీ మీద సైకోలా పడి ఎందుకలా పీడించుకు తింటున్నావు!
2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన అక్రమాని విజయనిర్మల మూడు నెలల క్రితమే తెలుగుదేశంలో చేరిపోయారు. దీంతో ఈ నియోజక వర్గంలో నడిపించే నేతే కరువయ్యారు. విశాఖ ఉత్తరం నుంచి 2019, 2024 సంవత్సరాల్లో పోటీ చేసి ఓడిపోయిన వైసీపీ నేత, నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కేకే రాజు ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించేశారు. జగన్ ముఖ్యమంత్రిగా వున్న సమయంలో విశాఖలో అత్యంత వివాదాస్పద నేతగా పేరుపడి విశాఖ విమానాశ్రయం వద్ద తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత వవన్ కళ్యాణ్ లను అడ్డుకొని వారి కార్లపై దాడి చేసిన కేకే రాజు ఇప్పుడు ఒక్కసారిగా చప్పపడిపోయారు. తనపై కేసులు, అరెస్టులు తప్పవన్న భయంతో ముందు జాగ్రత్త చర్యగా తన అనుచరులైన కార్పొరేటర్లను తనపై విజయం సాధించిన బీజేపీ నేత పి.విష్ణు కుమార్ రాజు దగ్గరకు పంపుతున్నారు. వైసీపీ ఎంపీలు స్పీకర్ ఎన్నిక సమయంలో కేంద్రంలో బీజేపీకి మద్దతిచ్చినందున తాము బీజేపీలో చేరడం తప్పుకాదన్న ఉపదేశంతో ఆయన కార్పొరేటర్లను పార్టీ ఫిరాయింపునకు ప్రోత్సహిస్తున్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
కువైట్: రెసిడెన్సీ చట్టాని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు! 750 మంది ప్రవాసులు అరెస్ట్!
వాట్సాప్ కీలక ప్రకటన! 66 లక్షల ఖాతాలు బ్లాక్! కొత్త సైబర్ భద్రతా చర్యలు!
అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు! భార్య కాపురానికి రాలేదని.. దాని వల్ల నాకేం ఉపయోగం రా బాబు!
మీకు అలసటగా ఉందా చీకాకుగా కూడా ఉంటున్నారా! అయితే మీ శరీరంలో బి12 లోపించినట్టే!
న్యూయార్క్ బ్రూక్లిన్ ప్రైడ్ ఈవెంట్‌లో! మహిళపై మిలియనీర్ బ్యాంకర్ దాడి! పదవికి రాజీనామా!
క్వాంటాస్ ఫ్లైట్‌లో విషాదం! భారత సంతతికి చెందిన యువతి మృతి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: