విజయవాడ-అవనిగడ్డ కరకట్టపై గతరాత్రి బస్తాలకొద్దీ ఫైళ్లను తగులబెట్టడం కలకలం రేపింది. గత రాత్రి 9 గంటల సమయంలో కొందరు వ్యక్తులు ఇన్నోవా కారులో వచ్చి పెనమలూరు మండలం పెదపులిపాక సమీపంలోని శ్రీనగర్ కాలనీవద్ద కారు ఆపి బస్తాలు దించి కరకట్టపై తగులబెట్టారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న టీడీపీ కార్యకర్త ఒకరు కాలుతున్న పత్రాలపై మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాలుష్య నియంత్రణమండలి మాజీ చైర్మన్ సమీర్‌శర్మ ఫొటోలు ఉండడాన్ని గమనించి వెంటనే పెనమలూరు ఎమ్మెల్యేబోడే ప్రసాద్, టీడీపీ నాయకులకు సమాచారం అందించారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
వారు ఆలస్యం చేయకుండా కరకట్ట వద్దకు చేరుకున్నారు. టీడీపీ నేతలను గమనించిన యువకులు యనమలకుదురువైపు పరారయ్యారు. అక్కడ టీడీపీ నేతలు ఆ వాహనాన్ని అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి వచ్చి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. సమీర్‌శర్మ సూచనతోనే ఫైళ్ల తగలబెట్టినట్టు ఇన్నోవా డ్రైవర్ నాగరాజు తెలిపారు. తగలబడిన ఫైళ్లు కాలుష్య నియంత్రణ మండలి, ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థకు చెందినవిగా అనుమానిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
ఏంటి ఇది నిజమేనా! రిషి సునాక్ కు ఈ సారి ఓటమి తప్పదా! ఎంతో ఆసక్తికరంగా యూకే ఎన్నికలు!
సీఎం చంద్రబాబు ప్రజా వేదిక కార్యక్రమం వాయిదా! కారణం ఆదేనా!
నెలలో మూడు రోజులు కేటాయిస్తాను... ఉప్పాడలో క్లారిటీ ఇచ్చిన డిప్యూటీ సీఎం! ఏంటో చూసేయండి!
రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన చంద్రబాబు! ఆ పదకం మళ్ళీ అమలు!
ఏపీలో నిరుద్యోగులకు బిగ్ అలర్ట్! గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా!
పార్లమెంటు కొత్త కేబినెట్ కమిటీలు ఏర్పాటు! తెలుగు రాష్ట్రాల ఎంపీలకు పెద్దపీట!
అమరావతిలో జగన్ రెడ్డి విధ్వంసాన్ని వివరించిన చంద్రబాబు! శ్వేత పత్రం విడుదల!
నీట్ పరీక్షపై హీరో విజయ్ సంచలన వ్యాఖ్యలు! ఆ పని చెయ్యండని సలహా!
అమరావతిలో జగన్ సర్కార్ చేసిన ఘనకార్యాలు అన్నీ ప్రజల ముందుకు! రాజధానిపై శ్వేతపత్రం విడుదల!
అక్రమార్కులతో చేతులుకలిపి ప్రజలను దోచుకుంటున్న దేవాదాయశాఖ అధికారులు! సస్పెన్షన్ కు గురైన పలువురు!
శ్రీవారి అన్నప్రసాదం తయారీపై టీటీడీ కీలక నిర్ణయం! భక్తుల ఫిర్యాదులు పరిగణనలోకి!
సీబీఐకి హై కోర్టు నోటీసులు! కేజ్రీవాల్ అరెస్ట్ పై విచారణ!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: