రైతులకు టీడీపీ చీఫ్, సీఎం చంద్రబాబు మరో భారీ గుడ్ న్యూస్ చెప్పారు. వ్యవసాయ, జలవనరుల శాఖలపై సీఎం చంద్రబాబు బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఖరీఫ్ సీజన్ పంటల ప్రణాళిక, సాగునీటి విడుదలపై రెండు శాఖల మంత్రులు, సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భగా అయన మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ లో రైతులకు సాగునీటి కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. గత వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్వహణను గాలికి వదిలేసిందని, వ్యవస్థలు అన్నీ మళ్లీ గాడిన పడాలని సూచించారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ప్రభుత్వ సాయం, సబ్సిడీలతో రైతులకు సాగు ఖర్చు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గత వైసీపీ ప్రభుత్వం ఎత్తేసిన పాత పంటల బీమా విధానాన్ని మళ్లీ తీసుకొస్తామని ఈ సందర్భంగా చంద్రబాబు రైతులకు శుభవార్త చెప్పారు. కాగా, ప్రకృతి వైపరీత్యాలు, వర్షాలు, ఇతర కారణాల వల్ల పంట నష్టపోతే.. పంటల బీమా విధానం కింద రైతులకు ప్రభుత్వమే ఆర్థిక సహయం అందిస్తోంది. ఈ విధానాన్నే మళ్లీ అమల్లోకి తీసుకొస్తామని తాజాగా చంద్రబాబు అనౌన్స్ చేశారు. సీఎం నిర్ణయం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
ఏపీలో నిరుద్యోగులకు బిగ్ అలర్ట్! గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా!
పార్లమెంటు కొత్త కేబినెట్ కమిటీలు ఏర్పాటు! తెలుగు రాష్ట్రాల ఎంపీలకు పెద్దపీట!
అమరావతిలో జగన్ రెడ్డి విధ్వంసాన్ని వివరించిన చంద్రబాబు! శ్వేత పత్రం విడుదల!
నీట్ పరీక్షపై హీరో విజయ్ సంచలన వ్యాఖ్యలు! ఆ పని చెయ్యండని సలహా!
అమరావతిలో జగన్ సర్కార్ చేసిన ఘనకార్యాలు అన్నీ ప్రజల ముందుకు! రాజధానిపై శ్వేతపత్రం విడుదల!
అక్రమార్కులతో చేతులుకలిపి ప్రజలను దోచుకుంటున్న దేవాదాయశాఖ అధికారులు! సస్పెన్షన్ కు గురైన పలువురు!
శ్రీవారి అన్నప్రసాదం తయారీపై టీటీడీ కీలక నిర్ణయం! భక్తుల ఫిర్యాదులు పరిగణనలోకి!
సీబీఐకి హై కోర్టు నోటీసులు! కేజ్రీవాల్ అరెస్ట్ పై విచారణ!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: