ఏపీ రాజధాని అమరావతిపై గత ప్రభుత్వం ఎలా వ్యవహరించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ ప్రభుత్వం విస్మరించిన అంశాలను వివరిస్తూ రాజధానికి సంబంధించిన శ్వేతపత్రాలను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్ర విభజన జరిగితే అమరావతిని రాజధానిగా చేసుకుంటామని అనుకోలేదన్నారు. ఏపీ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా విజయవాడ, గుంటూరు మధ్య కేపిటల్ ఉండాలని ఆ నాడు నిర్ణయించామన్నారు. అందుకు అప్పటి మంత్రి వర్గం కూడా ఆమోదించిందని చెప్పారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి సైతం అమరావతినే రాజధానిగా ఒప్పుకున్నారని గుర్తు చేశారు. ప్రతి ఊరు, గ్రామం నుంచి నీరు, మట్టి తీసుకొచ్చి అమరావతిలో ఉంచామని తెలిపారు. అలాగే దేశంలోని ప్రముఖ అలయాల నుంచి పవిత్రమైన నీటిని తీసుకొచ్చామన్నారు. ఆ జలం, మట్టి నేటికీ రాజధాని అమరావతిలోనే ఉందని తెలిపారు. ఏపీ రాజధాని నిర్మాణం కోసం ప్రధాని మోదీ సైతం జలం, మట్టిని అందించారని తెలిపారు. ఒక రాష్ట్ర రాజధాని అమరావతికి ఉన్న సౌలభ్యం దేశంలో ఏ రాష్ట్రానికి లేదని చంద్రబాబు వివరించారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
అయితే ఇలాంటి నగరంపై జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే విషం కక్కారని చంద్రబాబు పేర్కొన్నారు. రాజధాని పనులన్ని నిలివేశారని తెలిపారు. ప్రజల కోసం నిర్మించిన ప్రజా వేదికను సైతం నేల మట్టం చేశారని గుర్తు చేశారు. ఒక సెకను కూడా ఆలోచించకుండా ఆ కట్టడాన్ని ధ్వంసం చేశారని చెప్పారు. సింగపూర్ కన్సార్టియాన్ని రద్దుతో చేయడంతో పాటు రూ.720 కోట్ల ప్రాజెక్టు హ్యాపీ నెస్ట్ను నిలిపివేశారని చెప్పారు. అమరావతిలో నిర్మించిన భవనాల మొత్తం పాడయ్యాయని, నిర్మాణ సామాగ్రి తప్పు పట్టి పోయిందని చంద్రబాబు పేర్కొన్నారు. జగన్ సర్కార్ చేసిన అరాచకాలతో అమరావతి పూర్తిగా ధ్వంసం అయిందని చంద్రబాబు గుర్తు చేశారు. అంతేకాదు రైతులను జగన్ సర్కార్ ఏ విధంగా అవమానించిందనేదానిపైనా చంద్రబాబు వివరించారు. రాజధాని కోసం రైతులు వందలాది ఎకరాలు ఇస్తే అటువంటి వారిని కూడా వదిలి పెట్టలేదన్నారు. అమరావతికి చెందిన అన్నదాతలందరినీ రోడ్లపైకి లాగారని చెప్పారు. రైతు యాత్రలనూ అడ్డుకున్నారని తెలిపారు. అమరావతి కోసం అన్నదాతలు చేసిన త్యాగాలను చరిత్ర మర్చిపోదని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి:
నీట్ పరీక్షపై హీరో విజయ్ సంచలన వ్యాఖ్యలు! ఆ పని చెయ్యండని సలహా!
అమరావతిలో జగన్ సర్కార్ చేసిన ఘనకార్యాలు అన్నీ ప్రజల ముందుకు! రాజధానిపై శ్వేతపత్రం విడుదల!
అక్రమార్కులతో చేతులుకలిపి ప్రజలను దోచుకుంటున్న దేవాదాయశాఖ అధికారులు! సస్పెన్షన్ కు గురైన పలువురు!
శ్రీవారి అన్నప్రసాదం తయారీపై టీటీడీ కీలక నిర్ణయం! భక్తుల ఫిర్యాదులు పరిగణనలోకి!
సీబీఐకి హై కోర్టు నోటీసులు! కేజ్రీవాల్ అరెస్ట్ పై విచారణ!
ఏపీలో పెన్షన్ ఒక్క నెల తీసుకోకపోయినా రద్దు అవుతుందా? చంద్రబాబు కీలక ప్రకటన!
ఈ నెల 6 న తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్ సీన్! భేటీకి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్!
వైసీపీ ఓటమికి ముఖ్య కారణం అదే! కీలక విషయాలు బయటపెట్టిన CPI నారాయణ!
జగన్ రెడ్డికి మరో షాక్ ఇచ్చేందుకు వ్యూహం రెడీ! ముహూర్తం ఫిక్స్ చేసిన చంద్రబాబు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: