తాను ఈడీ నుంచి 55 గంటల విచారణను ఎదుర్కొన్నానని లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. సోమవారం ఆయన లోక్ సభలో మాట్లాడుతూ భారతదేశ ఆలోచన, రాజ్యాంగంపై దాడిని అడ్డుకుంటామని, తాము రక్షణగా నిలబడతామన్నారు. రాజ్యాంగంపై దాడిని అడ్డుకున్న వ్యక్తులపై దాడి జరుగుతోందని ఆరోపించారు. మోదీ పాలనలో చాలామంది ప్రతిపక్ష నాయకులపై దాడులు జరుగుతున్నాయన్నారు. విపక్ష నేతలను వేధించడం సరికాదన్నారు.
అధికారం కంటే నిజం గొప్పదనే విషయం తెలుసుకోవాలని సూచించారు. ప్రతిపక్షంలో ఉన్నందుకు తాను సంతోషంగా ఉన్నానని, గర్విస్తున్నానని వ్యాఖ్యానించారు. అధికార దుర్వినియోగం, పేదలు, దళితులు, మైనార్టీలపై దౌర్జన్యాన్ని వేలెత్తిచూపిన వారిని అణిచివేశారని మండిపడ్డారు. ప్రధాని మోదీ ఆదేశాలతోనే తనను విచారణ సంస్థలు విచారించాయన్నారు. ప్రతి మతం కూడా ధైర్యాన్ని బోధిస్తుందన్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
అయోధ్య రామమందిర సమయంలో కార్పోరేట్ పెద్దలకు మాత్రమే ఆహ్వానం అందిందని ఆరోపించారు. తన ఎంపీ పదవిని, ఇంటిని లాక్కున్నారని మండిపడ్డారు. విపక్ష నేతలను సీబీఐ, ఈడీలతో బెదిరిస్తున్నారని విమర్శించారు. హిందువులంటే బీజేపీ, ఆరెస్సెస్ మాత్రమే కాదన్నారు. సభలో ఉన్నవారు, బయట ఉన్నవారూ హిందువులే అన్నారు. హిందూ సమాజం అంటే మోదీ ఒక్కరే కాదన్నారు.
కొందరికి ఓ సింబల్ అంటే భయమని, అదే అభయహస్తం అని ఎద్దేవా చేశారు. అయోధ్యలో భూములు లాక్కొని విమానాశ్రయం నిర్మించారని విమర్శించారు. అయోధ్య రామాలయం ప్రారంభం సమయంలో అక్కడి బాధితులు దుఃఖంలో ఉండిపోయారన్నారు. ఆలయ పరిసరాలకు కూడా వారిని రానివ్వలేదన్నారు.
ప్రధాని మోదీ ఇప్పటి వరకు మణిపూర్‌కు వెళ్లలేదని విమర్శించారు. మణిపూర్ కూడా మన దేశంలో భాగమేనని వ్యాఖ్యానించారు. మణిపూర్ ఒకసారి వెళ్లాలని సూచించరు. అక్కడి పరిస్థితులు పరిశీలించాలన్నారు. మణిపూర్‌కు ప్రధాని వెళ్లలేదు, హోంమంత్రి కూడా వెళ్లలేదన్నారు. అక్కడి ఘటనలు తన కళ్లముందే ఉన్నాయని వ్యాఖ్యానించారు. కాగా, సభలో రాహుల్ గాంధీ గురునానక్ ఫొటోను ప్రదర్శించారు. ఫొటోను ప్రదర్శించడం నిషేధమని స్పీకర్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి:
వాలంటీర్లపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! ఉంచుతారా... తొలగిస్తారా?
నలుగురు ఐఏఎస్‌ల పదవీ విరమణ! జగన్ చెంచా జవహర్ రెడ్డి కూడా! రిటైర్ అయినా ఇతన్ని వదిలే ప్రసక్తి ఉండదు!
ఇకపై సీఎం చంద్రబాబును కలిసి మీ సమస్యలు చెప్పుకోవచ్చు! టోల్ ఫ్రీ నెంబర్ ఇదే!
లబ్దిదారు ఇంటికి వెళ్లి మరీ పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు! ఏపీలో పింఛన్ల పంపిణీ సందడి!
రాష్ట్రవ్యాప్తంగా 65.31 లక్షల మందికి పింఛన్లు పంపిణీ! ఏటా అయ్యే ఖర్చు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
రైతులకు అన్యాయం జరిగితే సహించం! కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు!
మోదీ సర్కార్ కు షాక్ ఇచ్చిన నితీశ్ కుమార్! హోదా కావాలంటూ తీర్మానం!
థాంక్యూ సర్ అన్నందుకు విమానం నుంచి దించేశారు! అసలు కారణం ఏంటో తెలుసా!
ఇదెక్కడి సైకోఇజం రా బాబు! పాటలు వింటే ఉరితీస్తారా! పూర్తి కథ ఏంటో చూసేయండి!
ఒకరి ఐఆర్‌సీటీసీ ఐడీతో ఇతరులకు టికెట్స్ బుక్ చేస్తే జైలుశిక్ష విధిస్తారా? రైల్వే సమాధానం ఇదే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: