ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిపై ఫోకస్ పెట్టింది. రాజధాని ప్రాంతంలో నిర్మాణాలను మళ్లీ మొదలు పెట్టే దిశగా అడుగులు వేస్తోంది.. ఈ మేరకు సీఆర్డీఏకు కొత్త కమిషనర్‌ను నియమించింది. తాజాగా అమరావతికి సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్, ఎండీగా రిటైర్డ్ ఐఏఎస్ లక్ష్మీ పార్థసారథి నియమించింది ప్రభుత్వం. ఈ మేరకు పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. లక్ష్మీ పార్థసారథి 2014- 2019 మధ్య కాలంలో (టీడీపీ ప్రభుత్వ హయాంలో) ఏడీసీ సీఎండీగా వ్యవహరించారు. రాజధాని మాస్టర్ ప్లాన్ సహా అమరావతి అభివృద్ధిపై ఆమెకు అవగాహన ఉండటంతో ఆమెను అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్, ఎండీగా నియమించారు. అమరావతి నిర్మాణంలో లక్ష్మీ పార్థసారథి సేవల్ని వినియోగించుకునే దిశగా ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని ప్రాంతంలో నిర్మాణాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేసిన సంగతి తెలిసిందే.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
అమెరికాలో తెలుగువారి డామినేషన్! యూనివర్సిటీలలో తెలుగులో స్వాగతం!
నెలకు రూ.25వేలతో ఉద్యోగం, ఉచిత భోజనం, వారికి మాత్రమే! ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్!
మీరు నమ్మాల్సిందే! ఇది అయోధ్య.. వైరల్ అవుతున్న న్యూస్! దారుణంగా రామాలయ పరిసర ప్రాంతాలు!
ఈ 35 ఫోన్ల మోడల్స్‌లో వాట్సాప్ బంద్! ఫోన్ల లిస్ట్ చూడండి! లిస్ట్ లో మీ ఫోన్ ఉంటే ఏమి చేయాలి?
తన జీవితంలో ఎదురైన లైంగిక వేధింపులు! ఎయిడ్స్ రావడంతో! సీనియర్ నటి షాకింగ్ కామెంట్స్!
ఒకరి ఐఆర్‌సీటీసీ ఐడీతో ఇతరులకు టికెట్స్ బుక్ చేస్తే జైలుశిక్ష విధిస్తారా? రైల్వే సమాధానం ఇదే!
ప్రపంచంలో అత్యధిక బంగారం ఉన్న టాప్ పది దేశాలు! మొదటి స్థానంలో అమెరికా! భారత్ స్థానం?
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: