అరెస్ట్ అయ్యారని ప్రచారం జరిగిన వైసీపీ నేత, ఆ పార్టీ సోషల్ మీడియా కార్యకర్త, వైఎస్ భారతి పీఏ వర్రా రవీందర్‌రెడ్డి నిన్న పులివెందులలో జగన్ వద్ద కనిపించారు. పులివెందుల వచ్చిన జగన్‌ను కలిసేందుకు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున క్యాంపు కార్యాలయానికి తరలివచ్చారు. రవీందర్‌రెడ్డి మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అక్కడే ఉన్నారు.
ఇంకా చదవండి: భారత్‌లో వేగంగా విస్తరిస్తున్న 5G నెట్‌వర్క్! మీ డేటా స్పీడ్‌పై ఏవైనా మార్పులు గమనించారా! తాజా నివేదిక ఏమంటోంది!
వైసీపీ అధికారంలో ఉండగా రవీందర్‌రెడ్డి గత కొన్నేళ్లుగా టీడీపీని, ఆ పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకుని అసత్య పోస్టులతో సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఆయనpostingలు జగన్ సోదరి షర్మిల, వివేకా కుమార్తె సునీతతో సహా అనేకమంది పై వ్యక్తిగత దూషణలు కలిగి ఉండేవి. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ పైనా అసభ్య పదజాలంతో వ్యతిరేక పోస్టులు చేశారు.
ఇంకా చదవండి: ఒకవైపు హీట్వేవ్, మరోవైపు భారీ వర్షాలు! IMD కీలక సూచనలు!
రవీందర్‌రెడ్డిపై ఏపీ మరియు తెలంగాణలో కేసులు నమోదయ్యాయి. సునీత ఫిర్యాదుపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. షర్మిల కూడా ఆయనపై ఫిర్యాదు చేశారు. ప్రస్తుత మంత్రి వంగలపూడి అనితపై కూడా రెండేళ్ల క్రితం అసభ్య పదజాలంతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అనిత ఫిర్యాదు మేరకు ఏపీ సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ నేపథ్యంలో రవీందర్‌రెడ్డిని నిన్న అరెస్ట్ చేసినట్టు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. అయితే, నిన్న ఆయన జగన్ వద్ద కనిపించడంతో అవి తప్పుడు వార్తలని తేలిపోయింది. రవీందర్‌రెడ్డిపై సెటిల్‌మెంట్లు, భూ దందాలు, పంచాయితీలు, బ్లాక్‌మెయిలింగ్ వంటి ఆరోపణలు కూడా ఉన్నాయి.
ఇంకా చదవండి: చంద్రబాబు స్పెషల్ టీం 19 IAS లు! శ్రీలక్ష్మి కి మొండి చెయ్యి! ఆ నలుగురికి శిక్ష తప్పదా!
మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
పర్యావరణానికి మేలు చేసే ఎలక్ట్రిక్ స్కూటర్లు! ఎంచుకునే ముందు ఏమేం చూడాలి!
BoAt Airdopes 131 Elite ANC లాంచ్! టాప్ ఫీచర్లు, ధర మరియు లభ్యత వివరాలు!
జగ్గయ్యపేటలో రాత్రంతా అధికారుల అలర్ట్! అసలు కారణం ఇదే!
మీ వద్ద తెల్ల రేషన్ కార్డు ఉందా! కేంద్రప్రభుత్వ పథకాలన్నీ ఉపయోగించుకుంటున్నారా?
తాగుబోతులకు గుడ్ న్యూస్! నాసిరకం జేబ్రాండ్లపై బ్యాన్, మద్యం ధరలు తగ్గిస్తామన్న మంత్రి ప్రకటన!
జులై 1న అవ్వాతాతలు, వికలాంగుల కళ్లల్లో కొత్త వెలుగులు! అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: