స్పీకర్ పదవికి ఒకే ఒక్క నామినేషన్, అయ్యన్న ఎన్నిక లాంఛనమే
ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ పదవి కోసం ఒకే ఒక నామినేషన్ రావడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. టీడీపీలో సీనియర్ నేతగా కొనసాగుతున్న అయ్యన్న కూటమి ఎమ్మెల్యేల్లో అత్యంత సీనియర్. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టిన ఏడాది 1983లో తొలిసారి నర్సీపట్నం నుంచి విజయం సాధించారు. ఇప్పటి వరకు ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఒకసారి అనకాపల్లి ఎంపీగానూ విజయం సాధించారు. పలుశాఖలకు మంత్రిగా పనిచేశారు. గతంలో కంటే ఈసారి 24,756 ఓట్ల మెజార్టీతో నర్సీపట్నం ప్రజలు గెలిపించారు.
ఇంకా చదవండి: మత్స్యకారులను చూసి ఆగిన హోంమంత్రి అనిత! అక్కడిక్కడే బాపట్ల ఎస్పీకి ఫోన్!
స్పీకర్ పదవి కోసం నామినేషన్ దాఖలు: ఏపీ శాసనసభ స్పీకర్ పదవి కోసం తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. ఆయన తరఫున కూటమి నేతలు నామినేషన్ పత్రాలను శాసనసభ కార్యదర్శికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ పాల్గొన్నారు. శనివారం ఉదయం 11 గంటలకు స్పీకర్ ఎన్నిక నిర్వహించనున్నారు.
ఇంకా చదవండి: AP DSC నోటిఫికేషన్ విడుదల! నిరుద్యోగుల ఆశలు చిగురించాయి!
42 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో ఎన్నో పదవులు: అయితే ఈరోజు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా పదవి ప్రమాణ కార్యక్రమం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తన రాజకీయ జీవితంలో ఎన్నో పదవులు చూసానని, ప్రస్తుతం స్పీకర్ పదవి దక్కడం అరుదైన విషయమని అన్నారు. 1983లో రాజకీయంలోకి ప్రవేశించానని, ఈ 42 ఏళ్ల ప్రయాణంలో పలుమార్లు మంత్రి పదవులను అలంకరించానని పేర్కొన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ , బీజేపీ నాయకులు తన పేరును సూచిస్తూ స్పీకర్ పదవికి నామినేషన్ వేయడం అభినందనీయమని అన్నారు.
నాకు గౌరవమైన పోస్టు ఇచ్చినందుకు గౌరవంగా మెలుగుతానని వెల్లడించారు. స్పీకర్ సీటులో కూర్చున తరువాత పార్టీ గుర్తుకు రావొద్దని అభిప్రాయం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లేనప్పటికీ తాము అందరినీ గౌరవవిస్తామని స్పష్టం చేశారు.సభ్యులకు మాట్లాడే అవకాశం కల్పిస్తానని, అవసరమైనే వారికి శిక్షణ కూడా ఇస్తామని తెలిపారు. ప్రజలు తమకు పదవులు ఇవ్వలేదని, బాధ్యత ఇచ్చారని, ఆ బాధ్యతను సక్రమంగా నెరవేర్చుతానని అయ్యన్నపాత్రుడు అన్నారు.
ఇంకా చదవండి: ధర రూ.12,000 కే 6.72 అంగుళాల డిస్‌ప్లే, 50MP కెమెరా! అదిరిపోయే VIVO T3 లైట్ మీ కోసమే!
మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
నీట్ అవకతవకలపై కేంద్రం కీలక చర్య! ప్రతిపక్ష నిరసనలపై మంత్రి స్పందన!
IRGCపై కెనడా తీవ్రవాద ట్యాగ్! ఇరాన్ స్పందన తీవ్ర విమర్శలతో!
రైతులకు కేంద్రం గుడ్ న్యూస్! ఖరీఫ్ పంటల MSP భారీగా పెంపు!
చంద్రబాబు స్పెషల్ టీం 19 IAS లు! శ్రీలక్ష్మి కి మొండి చెయ్యి! ఆ నలుగురికి శిక్ష తప్పదా!
మీ వద్ద తెల్ల రేషన్ కార్డు ఉందా! కేంద్రప్రభుత్వ పథకాలన్నీ ఉపయోగించుకుంటున్నారా?
తాగుబోతులకు గుడ్ న్యూస్! నాసిరకం జేబ్రాండ్లపై బ్యాన్, మద్యం ధరలు తగ్గిస్తామన్న మంత్రి ప్రకటన!
ఎంపీ స్థానాన్ని రాహుల్ వదులుకుంటారా! వయనాడ్ నుంచి ప్రియాంక గాంధీ ఎన్నికల బరిలో దిగనుందా!
జులై 1న అవ్వాతాతలు, వికలాంగుల కళ్లల్లో కొత్త వెలుగులు! అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: