టీవీ 9 నవరంధ్రాలూ మూసుకుపోయాయి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై విద్వేషం, అమరావతిపై విషప్రచారం, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఓటమే లక్ష్యంగా జగన్ కళ్లలో సైకో ఆనందం చూడటం కోసం ఇన్నాళ్లూ పనిచేసిన టీవీ9 నవరంధ్రాలూ మూసుకుపోయాయి. ఏపీఎస్ఎఫ్ఎల్ లో టీవీ9ని ఆపేశారు. ఇప్పుడు ఏపీ ఎమ్మెస్వోల అసోసియేషన్ కూడా టీవీ9ని రాష్ట్రవ్యాప్తంగా బ్యాన్ చేయాలని నిర్ణయించింది. కుల, మత, ప్రాంత ఘర్షణలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్న టీవీ9ని ఏపీ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా నిలిపేయాలని ఎమ్మెస్వోలు తీర్మానం చేశారు.
టీవీ9 ఎంత బరితెగించినా భరించిన ఏపీ ప్రజలు, టీవీ9 తెరవెనుక యజమాని జగన్ పార్టీ వైసీపీని అత్యంత దారుణంగా ఓడించి ఇంటికి పంపారు. అయినా కుక్క తోక వంకర మాదిరిగా, టిడిపి-జనసేన మధ్య విభేదాలు సృష్టించేలా జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాంబర్‌ని, టిడిపి నేత ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కోరారని, ఇరు పార్టీల మధ్య విభేదాలు సృష్టించే కల్పిత కథనం ప్రసారం చేశారు. దీనిపై కూటమి నేతలు టీవీ9పై ఆగ్రహంగా ఉన్నారు.
మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇప్పటికే టీవీ9 డిబేట్‌కి ఎవరూ వెళ్లకూడదని టిడిపి, జనసేన, బీజేపీ నేతలు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ మూడు పార్టీల నుంచి ఎవరైనా టివి9 డిబేట్లకు వెళితే ఖచ్చితంగా వారు వైసీపీ కోవర్టు అని స్పష్టం అయిపోతోంది. టిడిపి, జనసేన, బీజేపీ అధికారప్రతినిధులు ఎవరూ రాకపోవడంతో రజనీకాంత్ పాచిపళ్ల వెకిలినవ్వుల చర్చా కార్యక్రమాలు రద్దు చేశారు.
టీవీ9కి ఇంతటి దిక్కుమాలిన పరిస్థితి రావడానికి కారణం.. ప్రజలు వైసీపీ పట్ల తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని తెలిసి...వైసీపీని సమర్థిస్తూ, కూటమిపై విషప్రచారానికి బరితెగించడమే.. ఏపీఎస్ఎఫ్ఎల్, ఎమ్మెస్వోల నిర్ణయంతో ఇప్పుడు టీవీ9 నవరంధ్రాలు మూసుకుపోయాయి. ఇప్పుడు టీవీ9ని యూట్యూబులో మాత్రమే చూడొచ్చు. టీవీ9ని గుప్పిట్లో పెట్టుకుని తెలుగు రాష్ట్రాలను ఏలాలని...టిడిపి, జనసేనని ఓడించాలని విశ్వప్రయత్నాలు చేసి విఫలమై...దాదాపు కనుమరుగు అయ్యే పరిస్థితికి వస్తోంది. టీవీ9 యాజమాన్యానికి ముందస్తు శుభాకాంక్షలు. త్వరలో టీవీ9 వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖచిత్రంతో బ్లూ కలర్ కొత్త లోగోతో జగన్ యాజమాన్యంలో మారనుంది.
ఇవి కూడా చదవండి:
పాస్ పుస్తకాలపై ఎలాంటి ఫోటోలు ఉండకూడదు! ప్రభుత్వం ఉత్తర్వులు!
సెక్రటేరియట్‌లో మంత్రులకు ఇచ్చిన ఛాంబర్లు! మొదటి బ్లాక్ లో!
ప్రభుత్వ కాలేజీ ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ! జులై 15 లోగా!
బెంగాల్ లో రైల్వే సేవలు తిరిగి ప్రారంభం! 10 కి చేరిన మృతుల సంఖ్య!
ఇవాళ మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న పవన్‌కల్యాణ్! పూర్తి షెడ్యూల్ ఇదే!
5 లక్షల విదేశీయులకు పౌరసత్వం ఇవ్వబోతున్న జో బైడెన్! కావలసిన అర్హతలు ఏంటో తెలుసా!
దేశంలో పలు విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు! 3 ఎయిర్ పోర్ట్ ల వద్ద హై అలర్ట్!
బిజేపి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతల కౌంటర్! 2014లో మోడీ చేసింది ఏంటి?
షాకింగ్ నిజాలను వెల్లడించిన సైంటిస్టులు! త్వరలో రోజుకు 25 గంటలు!
శ్రీకాకుళం: జిల్లా అధికారులతో బాబాయ్, అబ్బాయ్ భేటీ! జెట్ స్పీడ్ లో పనులు మొదలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: