కేరళలోని వయనాడ్ నుంచి రాహుల్ సోదరి ప్రియాంకాగాంధీ పోటీచేయనున్నారు. ఆమెను బరిలో దింపడంపై బీజేపీ స్పందించింది. వారసత్వ రాజకీయాలు అంటూ కాంగ్రెస్ పై ఫైర్ అయ్యింది. ఇది కాంగ్రెస్ పార్టీ కాదని, కుటుంబ సంస్థ అని నిరూపించినట్లయ్యిందని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రజలకు ద్రోహం చేస్తోందని కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ విమర్శించారు. రాహుల్ వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారనే విషయాన్ని దాచిపెట్టారని పేర్కొన్నారు. తమ కుటుంబం నుంచి ఒకరి తర్వాత ఒకరిని వయనాడ్ ఓటర్లపై రుద్దడం సిగ్గుచేటు చర్య అని మండిపడ్డారు. రాహుల్ నేతృత్వంలోని కాంగ్రెస్ వరుసగా మూడోసారి ఓడిపోవడానికి ఈ ద్రోహ విధానమే కారణం అని ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
బీజేపీ కామెంట్లపై కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా అదే రేంజులో స్పందించారు. 2014లో వారణాసి నుంచి పోటీ చేస్తున్న విషయాన్ని మోడీ వడోదర ప్రజల వద్ద దాచిపెట్టారా..? అంటూ ప్రశ్నించారు. నరేంద్ర మోడీ ట్రాక్ రికార్డుని ఎత్తి చూపారు. 2014 ఎన్నికల్లో.. గుజరాత్లోని వడోదరతో పాటు యూపీలోని వారణాసి నుంచి మోడీ పోటీ చేశారు. రెండుచోట్లా విజయం సాధించడంతో ఆయన వడోదర సీటును వదులుకున్నారు. ఇదే విషయాన్ని కాంగ్రెస్ ప్రస్తావించింది. ఇదిలా ఉంటే.. వయనాడ్ నుంచి ప్రియాంక గెలిస్తే.. తొలిసారిగా ఆమె పార్లమెంటులోకి అడుగుపెడతారు. వయనాడ్ నుంచి రాహుల్పై సీపీఐకి చెందిన అన్నీ రాజా, బీజేపీకి చెందిన సురేంద్రన్ పోటీ చేశారు. అయితే ఇప్పుడు అన్నీ రాజా బరిలో ఉంటారో, లేదో తెలియాల్సిఉంది.
ఇవి కూడా చదవండి:
షాకింగ్ నిజాలను వెల్లడించిన సైంటిస్టులు! త్వరలో రోజుకు 25 గంటలు!
శ్రీకాకుళం: జిల్లా అధికారులతో బాబాయ్, అబ్బాయ్ భేటీ! జెట్ స్పీడ్ లో పనులు మొదలు!
ఈ 5 ఏళ్ల జగన్ పాలనలో పొలవరాన్ని నాశనం చేశారు! మరో 5 ఏళ్లు పట్టే పరిస్థితి!
మహానంది ఆలయం వద్ద చిరుత కలకలం! భయంతో ప్రజలు!
చంద్రబాబు అరెస్ట్ సమయంలో ఆయన ఫ్యామిలీ పడ్డ బాధ కళ్లారా చూశా! కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు!
తాజాగా ఈవీఎంల విషయంలో జగన్ రెడ్డి సంచలన ట్వీట్! పదవి పోయి ఉపన్యాసాలు షురూ!
అసోంలో భారీగా పట్టుబడిన డ్రగ్స్! సబ్బు పెట్టెల్లో తరలిస్తూ! వాటి విలువ ఎంతో తెలిస్తే అవాక్కే!
నీట్ పేపర్ లీక్ ఆరోపణలపై స్పందించిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ! ఆసక్తికర ట్వీట్!
అమెరికా: కాలిఫోర్నియాలో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో కూటమి విజయోత్సవ సంబరాలు! 250 కార్లతో ర్యాలీ!
భారత్ - శ్రీలంక మధ్య రోడ్డు మార్గం రానుందా! ఏంటి ఇది నిజమేనా?
నిప్పు నీళ్ళతో స్నానం ఎప్పుడైనా చూశారా! వీడియో వైరల్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: